అసలు విషయం తెలుసుకున్న పవన్ ? ఈ కొత్త నిర్ణయం వెనుక ?

పార్టీ స్థాపించిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అసలు విషయం అర్థమైంది. రాజకీయాలు వేరు సినిమాలు వేరు అని, సినిమా నటులు చూసి ఓట్లు వేసే పరిస్థితి లేదనే విషయాన్ని చాలా ఆలస్యంగా పవన్ గుర్తించారు.

పార్టీ స్థాపించి ఏడు సంవత్సరాలు దాటుతున్నా, ఇంకా క్షేత్రస్థాయిలో బలం పెంచుకునే అవకాశం లేకపోవడం, కేవలం పవన్ ఛరిష్మా మీద జనసేన ముందుకు వెళుతుండటం, జనాల్లో జనసేన పై విపరీతమైన ఆదరణ ఉంది అనే తప్పుడు అంచనా వేసుకోవడం ఇలా ఎన్నో అంశాలు జనసేనకు ఇబ్బందికరంగా మారాయి.2019 ఎన్నికల్లో జనసేన ఘోరాతి ఘోరంగా ఓటమి చెందడాన్ని పవన్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.తనకున్న అభిమానులు, ఎన్నికల ప్రచారంలో వచ్చిన జనాలను చూసి కనీసం 30 స్థానాలు దక్కుతాయని అంచనా వేశారు.

కానీ ఒకే ఒక్క నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి గెలిచారు.స్వయంగా పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి చెందడంతో ఒక రకంగా తీవ్ర నిరాశకు గురయ్యారు.

పార్టీ ని నడిపించడం ఆషామాషీ వ్యవహారం కాదనే విషయాన్ని గుర్తించారు.దీనికితోడ ఆర్థిక పరిస్థితులు చుట్టుముట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాల వైపు మొగ్గు చూపించారు.అయితే ఒకసారి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తాడోపేడో తేల్చుకోవాలి తప్ప ఇలా మధ్యలోనే కాడి వదిలేస్తే మొదటికే మోసం వస్తుందని పవన్ గ్రహించారు.

అందుకే క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యల పైన జనసేన పోరాటాన్ని మొదలు పెట్టింది.వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో అసంతృప్తి ఉంది అనే విషయాన్ని గుర్తించి వాటిపైన పోరాడేందుకు సిద్ధమయ్యారు.

Advertisement

తమకు పెద్దగా బలం లేదని తెలిసినా, 2019 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి వ్యూహాత్మక తప్పిదం చేశామని, జనసేన గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లోనే దృష్టి పెట్టి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదనే విషయాన్ని గుర్తించారు.

అందుకే 2024 ఎన్నికల్లో జనసేన కేవలం కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని, కనీసం ముప్పై, ముప్పై ఐదు స్థానాలు దక్కించుకోగలిగితే ఏపీలో కింగ్ మేకర్ అవుతామని, అప్పుడు ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా, తమ మద్దతు కావాల్సిందేనని, ఆ విధంగా ఏపీలో తాము చక్రం తిప్పేందుకు అవకాశం ఏర్పడుతుందనే విషయాన్ని గుర్తించడంతో, ఇప్పుడు జనసేన కు అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలు ఏంటి అనే విషయం పై సర్వే చేయిస్తున్నట్లు సమాచారం.ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలతోపాటు, రాయలసీమ, చిత్తూరు ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన కు ఆదరణ ఉంటుందనే విషయాన్ని పవన్ గుర్తించారట.సర్వే నివేదిక వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో నియోజకవర్గాల పైన ఎక్కువ ఫోకస్ పెట్టి అక్కడి నుంచే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులను దించి సక్సెస్ అవ్వాలని డిసైడ్ అయ్యారట.

Advertisement

తాజా వార్తలు