జనసేన-బీజేపీ కీలక బేటీలో! చర్చించే అంశాలు ఇవేనా

ఏపీ రాజకీయాలలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్న జనసేన, బీజేపీ పార్టీలు తాజాగా జరిగిన ఎన్నికలలో ప్రత్యేక హోదా అంశం విషయంలో విభేదాల కారణంగా ఎవరికివారు ఒంటరిగా పోటీ చేశారు.

అయితే రెండు పార్టీలకి ఆశాభంగం అయ్యింది.

అయితే మోడీని స్పూర్తిగా తీసుకొని రాజకీయాలు నడిపించే పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు మాత్రం కొనసాగిస్తున్నారు.ఆ సంబంధాలని మరింత బలం చేసుకోవడానికి రానున్న రోజుల్లో కలిసి పోరాటం చేసే దిశగా ఉమ్మడి అడుగులు వేస్తున్నారు.

దీనికి ఇప్పటికే రంగం సిద్ధం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక భేటీకి సిద్ధం అయ్యారు.తాజాగా విజయవాడ వేదికగా జనసేన, బీజేపీ పార్టీలు కీలక భేటీ జరగనుంది.

ఈ బేటీలో సుదీర్ఘ రాజకీయ అంశాలని రెండు పార్టీల నేతలు చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది.ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిణామాలు, వైసీపీ పరిపాలన, మూడు రాజధానుల అంశం, అలాగే స్థానిక సంస్థల పొత్తు అంశాలని కీలకంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది.

Advertisement

ఇక బీజేపీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం ద్వారా ఏపీలో అధికారంలోకి రావాలని భావిస్తుంది.ఈ రెండు పార్టీల కలయిక ద్వారా మత, కుల సమీకరణాలు కూడా కలిసొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

ఏది ఏమైనా రెండు పార్టీల మధ్య పొత్తు చిగురిస్తే అది కచ్చితంగా టీడీపీ, వైసీపీలకి పెద్ద ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట .

Advertisement

తాజా వార్తలు