ఆ వార్తలన్నీ అవాస్తవం... రెమ్యూనరేషన్ పై స్పందించిన జైలర్ విలన్?

సూపర్ స్టార్ రజినీకాంత్ ( Rajinikanth ) నటించిన తాజా చిత్రం జైలర్( Jailer ).

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బాస్టర్ అందుకుందో మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా ఊహించిన దానికన్నా రెట్టింపు లాభం పొందడంతో నిర్మాత కళానిధి మారన్ చిత్ర బృందానికి పెద్ద ఎత్తున విలువైన కానుకలు అందించడమే కాకుండా ఈ సినిమా కోసం పనిచేస్తున్నటువంటి దాదాపు 300 మందికి గోల్డెన్ కాయిన్స్ బహుమానంగా ఇచ్చారు.ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ కావడానికి దర్శకులు హీరోలు మాత్రమే కాకుండా నిర్మాత కూడా ఎంతో కీలకపాత్ర పోషించారని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించినటువంటి వినాయకన్ ( Vinayakan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన ఒక మలయాళీ.అయితే… తమిళ సినిమాలు కూడా చేశారు.

ఈ విధంగా ఎన్నో తమిళ సినిమాలలో నటించినటువంటి ఈయన గత కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారా అయితే దాదాపు 10 ఏళ్ల తర్వాత జైలర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాలో తన నటనతో అందరిని మెప్పించారు.

Advertisement

ఇక ఈ సినిమా విజయంలో ఎంత కీలక పాత్ర పోషించినటువంటి వినాయకన్ జైలర్ సినిమాకు తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ గురించి గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా కోసం ఈయన కేవలం 35 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నారనీ వార్తలు వచ్చాయి.ఈ సినిమా సక్సెస్ కావడంతో దర్శకుడికి హీరోకి మ్యూజిక్ డైరెక్టర్ కి అదనంగా రెమ్యూనరేషన్, ఖరీదైన కార్లను బహుమానంగా ఇచ్చిన నిర్మాత విలన్ పాత్రలో నటించిన ఈ నటుడికి మాత్రం ఇంత తక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడం ఏంటి అంటూ ఆశ్చర్యపోయారు అయితే తన రెమ్యూనరేషన్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై స్పందించిన వినాయకన్ తన రెమ్యూనరేషన్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు.ప్రస్తుతం ఈ వార్తలలో వస్తున్నటువంటి ఈ రెమ్యూనరేషన్ కి నాకు మూడింతలు రెమ్యూనరేషన్ నిర్మాత ఇచ్చారని, బహుశా ఈ విషయం ఆయన చెవిలో పడలేదని నేను ఆశిస్తున్నాను.

ఈ సినిమా కోసం నేను అడిగినంత మొత్తం రెమ్యూనరేషన్ ఇవ్వడమే కాకుండా నాకు చాలా మర్యాద కూడా ఇచ్చారనీ ఈయన ఆ వార్తలను కొట్టి పారేశారు.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు