నేను డబ్బున్న పేద వాడిని.. నా పని అయిపోయింది జగపతిబాబు షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి జగపతిబాబు ( Jagapathi Babu ) ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం విలన్ పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాష చిత్రాలలో కూడా విలన్ పాత్రల( Villan roles ) లో నటిస్తూ తన కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

 Jagapathi Babu Sensational Comments On Effect Of Big Movie Chances, Jagapathi Ba-TeluguStop.com

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండే జగపతి బాబు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా పేరు ఒక వీడియోని షేర్ చేస్తూ తన కెరియర్ గురించి చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.నాకు పెద్ద సినిమాలు మాత్రమే కాకుండా చిన్న సినిమాలలో కూడా నటించాలని కోరికగా ఉంది కమిటెడ్ చేస్తున్నారు. చిన్న సినిమాలు కూడా కొత్తగా ఉంటున్నాయి.

అయితే నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను డబ్బున్న పేదవాడిని నా చేతిలో పెద్ద పెద్ద సినిమాలో ఉన్నాయి కానీ ఆ సినిమాలు షూటింగ్ జరుపుకోకుండా పోస్ట్ పోన్ అవుతున్నాయి.

అలా పెద్ద సినిమాలు చేతిలో ఉండటం వల్ల వేరే సినిమా అవకాశాలు కూడా రావటం లేదు అంతేకాకుండా వామ్మో జగపతిబాబు మన సినిమాలలో నటిస్తారా ఆయన పెద్దపెద్ద సినిమాలే చేస్తారు.మన సినిమాలలో చేయాలి అంటే ఎక్కువ రెమ్యూనరేషన్( Remuneration ) తీసుకుంటారు అని కూడా అనుకుంటున్నారు.ఇలా పెద్ద సినిమాలు చేతిలో ఉండి ఆగిపోవడం వల్ల నాకు సినిమా అవకాశాలు కూడా రాలేదని గతంలో రెండు మూడు సార్లు ఇక ఇండస్ట్రీలో నా పని అయిపోయింది అనుకున్నాను కానీ మీ జగపతిబాబు ఎక్కడికి వెళ్లరు వెళ్లినట్టే వెళ్లి మళ్లీ వస్తుంటారు అంటూ ఈయన షేర్ చేసినటువంటి ఈ వీడియో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube