ధాన్యం గోదాముపై అడవి ఏనుగు దాడి.. వీడియో చూస్తే గుండె గుబేల్..

కేరళ-కర్ణాటక సరిహద్దులోని గుండ్లుపేట అడవి( Gundlupet forest)లో ఒక ఆకలితో ఉన్న ఏనుగు ధాన్యం గోదాముపై దాడి చేసింది.ఈ షాకింగ్ దృశ్యాలకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 Wild Elephant Attack On Grain Warehouse, Gundlupet Forest, Kerala-karnataka Bord-TeluguStop.com

వీడియోలో ఏనుగు గోదాము వైపు దూకుడుగా వెళ్ళడం, లోపల ఉన్న వాళ్ళు భయంతో పరుగులు తీయడం కనిపిస్తుంది.ఏనుగు తన తొండంతో గోదాము షట్టర్‌ను పక్కకు తోసింది.

ఆపై లోపల ఉన్న ఒక బియ్యం సంచిని లాక్కుంటుంది.చుట్టుపక్కల వాళ్ళు ఏనుగును వెళ్ళగొట్టడానికి ప్రయత్నించినప్పటికీ, ఏనుగు సంచిని తన పాదంతో చింపి ధాన్యాన్ని తింటుంది.

ఈ వీడియోను నరేష్ నంబిశన్ అనే యూజర్ ఎక్స్‌ (ట్విట్టర్)లో షేర్ చేశారు.వీడియో చూసిన వారందరూ ఏనుగు( Elephant) ఆకలిని చూసి బాధపడ్డారు.అడవులు నాశనం కావడం వల్ల ఏనుగులు ఆహారం కోసం మానవ ప్రాంతాలలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.ఈ ఘటన మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది.

అడవులను కాపాడుకోవడం మనందరి బాధ్యత.అడవులు ఉంటేనే అడవి జంతువులు బతకగలవు.

ఈ వీడియోను షేర్ చేసిన నరేష్ నంబిశన్, విషయాన్ని మరిన్ని స్పష్టంగా చెప్పే క్యాప్షన్ రాశారు.“అడవిలో తిండి దొరకని ఏనుగు, పొట్ట నింపుకోవడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( FCI ) గోదాముకు వచ్చింది” అని రాశారు.ఏప్రిల్ 2న పోస్ట్ చేసిన ఈ వీడియో చాలా తొందరగా వైరల్ అయ్యి, 1 లక్ష 86 వేలకు పైగా వ్యూస్ సాధించింది.అడవిలో ఏనుగులకు తిండి కరువు ఉందేమో అని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు.

అడవి పరిరక్షణకు పాలకులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కొంతమంది ఏనుగు చూపించిన సంయమనాన్ని మెచ్చుకుంటూ, మనుషుల ప్రవర్తనతో పోల్చారు.

మరికొంతమంది ఫ్రీ రేషన్ తీసుకోవడానికి వచ్చిందని సరదాగా కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube