జగన్ డిల్లీ పయనం..అసలు కారణం అదే !

ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి( AP CM Jangan ) మరోసారి డిల్లీ పయనం అయ్యారు.

డిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ప్రధాని అధ్యక్షతన జరగనున్న నీతి అయోగ్( Niti Aayog ) సమావేశంలో పాల్గొనేందుకు ఆయన డిల్లీ పయనం అయినట్లు అధికారిక సమాచారం.

అయితే ఆ సమావేశం ముగిసిన తరువాత ప్రధాని మోడితోను( PM Modi ) మరియు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో వైఎస్ జగన్ ప్రతెక భేటీ కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.అయితే నీతి అయోగ్ సమావేశం గురించి అటుంచితే.

ఆయన ప్రస్తుతం డిల్లీ వెళ్లడానికి ఇంకో కారణం కూడా ఉందనేది పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.వైఎస్ అవినాష్ రెడ్డి( YS Avinash reddy ) చుట్టూ తెలంగాణ సీబీఐ తిరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ నెల 22న అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన తల్లి అనారోగ్యం నిమిత్తం విచారణకు హాజరు కాలేకపోయారు.అయితే విచారణ తరువాత అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనే భయంతోనే అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాలేదనే వాదన వినిపిస్తోంది.ఆ తరువాత కర్నూల్ విశ్వభారతి ఆసుపత్రి వద్ద భారీ ఎత్తున వైసీపీ కార్యకర్తలు మోహరిచడం, సీబీఐ కేంద్ర బలగాల సహాయం కోరడం, వంటి పరిణామాలు క్షణ క్షణం ఏం జరుగుతుందా అనే ఉత్కంఠను రేపాయి.

Advertisement

అయితే ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి సుప్రీం కోర్టు ను ఆశ్రయించగా.సుప్రీం కోర్టు తుది తీర్పును హైకోర్టుకే వదిలేసింది.

దీంతో నిన్న జగరాల్సిన విచారణ నేటికీ వాయిదా పడింది.దీంతో నేడు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందో అనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది.ఇదిలా జరుగుతుండగా వైఎస్ జగన్ డిల్లీ పయనం అవ్వడం ప్రదాన్యం సంతరించుకుంది.

అయితే అవినాష్ రెడ్డి విచారణ కీలక దశకు చేరిన ప్రతిసారి ఏదో ఒక కారణం చేత డిల్లీ పయనం అవుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.కాగా కేంద్రం సహాయంతోనే అవినాష్ రెడ్డి అరెస్ట్ ను అవ్వకుండా జగన్ కాపాడుతున్నారనే విమర్శ ఉంది.

అయితే వచ్చే నెల జూన్ 30 నాటికి ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీం కోర్టు గతంలోనే సీబీఐకి సూచించింది.ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ విషయంలో నేడు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

అసలు కేంద్ర పెద్దలతో జగన్ ఏం చర్చించబోతున్నారు.అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు