కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే, ఎమ్మెల్యేలు, నాయకుల తీరు కారణంగా ప్రభుత్వ పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వైసీపీ అధిష్టానంలో ఉండగా, పార్టీ కోసం తాము నియోజకవర్గ స్థాయిలో ఎంతో కష్టపడి, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా చేసినా, తమకు తగిన గుర్తింపు లేకుండా పార్టీ చేసిందని, ప్రభుత్వ కార్యక్రమాల్లో గాని, పథకాలను ప్రజలోకి తీసుకువెళ్లే విషయంలో తమ పాత్ర నామమాత్రంగానే ఉందనేది వైసీపీ ఎమ్మెల్యేల ఆవేదన.ఇదంతా ఇలా ఉంటే, ఎమ్మెల్యేల పనితీరుపై వైసీపీకి చెందిన ఓ మంత్రి, ఓ ఎంపీ రహస్యంగా ఓ సర్వే చేయించగా సంచలన ఫలితాలు బయటపడినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూనే వాటిని అమలు చేస్తోంది.చివరకు కరోనా కష్టకాలంలోనూ ఎటువంటి ఇబ్బంది లేకుండా, అమలు చేస్తోంది.
ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను రూపొందిస్తూ, వాటిని అమలు చేస్తూ, ప్రజల్లో మరింతగా దూసుకువెళ్లిపోతున్నాడగా, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన క్రెడిట్ రాకపోగా, ఎమ్మెల్యేలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సర్వేలు తేల్చడంతో జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా టీడీపీ నుంచి వైసీపీలో ఎమ్మెల్యేగా గెలుపొందిన వారు, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పట్టు సాధించలేకపోతున్నారని, గ్రూపు రాజకీయాలకు ఎక్కువగా అటువంటి నియోజకవర్గాల్లో చోటుచేసుకుంటున్నాయని, నాయకులందరినీ సమన్వయం చేసుకుని కలుపు వెళ్లడంలో వారంతా విఫలమవుతున్నారని తేలిందట.
అసలు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ? ఎవరికి అంతుపట్టని విషయంగా ఉందనేది ఆ సర్వేలో తేలినట్లు తెలుస్తోంది.చెన్నైకి చెందిన ప్రైవేటు సంస్థ ద్వారా వైసీపీ ప్రభుత్వం ఈ సీక్రెట్ సర్వేను చేయించినట్లు తెలుస్తోంది.

ఇసుక, భూకబ్జాలు వంటి వ్యవహారాలను ఇంకా అనేక వ్యవహారాల్లో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటూ, ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారని గుర్తించిన అధిష్టానం తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.అలాగే కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి అయిన, టిడిపికి చెందిన నాయకులను పార్టీలో చేర్చుకుని, వారికి కాంట్రాక్టు ఇస్తున్నట్లుగా ఆ సర్వే లో తేలడంతో గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈ వ్యవహారాలు ఏవీ బయటకు పొక్కకుండా, వైసీపీ అధిష్టానం జాగ్రత్తలు పడుతున్నట్టు తెలుస్తోంది.జగన్ కు అత్యంత సన్నిహితుడైన ఓ మంత్రి, ఎంపీ ఆధ్వర్యంలో ఈ సర్వే వివరాలు జగన్ కు అందగానే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు జగన్ నుంచి గట్టి వార్నింగ్ లే వెళ్ళినట్లుగా గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి.