కేసిఆర్ పై షర్మిల విమర్శలు.. ఉలిక్కిపడుతున్న జగన్ ? 

జగనన్న వదిలిన బాణమో. కే సిఆర్ వదిలిన అస్త్రమో తెలియదు కానీ, తెలంగాణలో షర్మిల పూర్తి స్థాయిలో పార్టీని పెట్టకుండానే ప్రధాన ప్రతిపక్షం స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

ప్రతి చిన్న విషయం పైన ఆమె స్పందిస్తూ, టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూనే ఉన్నారు.కేసీఆర్ ప్రభుత్వంలో ఏ చిన్న తప్పిదం జరిగినా, బిజెపి, కాంగ్రెస్ పార్టీల కంటే ముందుగానే షర్మిల రీయాక్ట్ అయిపోతున్నారు.

కెసిఆర్, ఆయన మంత్రులను నిలదీస్తూ ఆమె నిత్యం ఏదో ఒక అంశం పై విమర్శలు చేస్తూనే ఉన్నారు.అయితే షర్మిల చేసే విమర్శలు కేవలం కేసిఆర్ మాత్రమే ఉలిక్కిపడేలా కాకుండా , షర్మిల అన్న, ఏపీ సీఎం జగన్ సైతం ఉలిక్కి పడే విధంగా ఉన్నాయి.

కొద్ది రోజుల క్రితం నిరుద్యోగ సమస్యపై షర్మిల హడావుడి చేశారు.నిరుద్యోగులు ఆవేదనగా ఉన్నారని, ఉద్యోగాల భర్తీ ఇంకెప్పుడు చేస్తారంటూ ఆమె దీక్ష సైతం చేపట్టారు.

Advertisement

ఏపీ ప్రభుత్వం పైనా ఆ ఎఫెక్ట్ పడడంతో, వెంటనే షర్మిల దీక్ష చేపట్టిన మరుసటి రోజునే ఉద్యోగాల ప్రకటన కు సంబంధించి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

రైతుల సమస్యలు , తెలంగాణలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు.అవే సమస్యలు ఏపీలోనూ ఉండడంతో జగన్ ప్రభుత్వానికి షర్మిల విమర్శల బాణాలు గుచ్చుకుంటున్నాయి.తాజాగా మల్లన్న సాగర్ ముంపు బాధితుడు ఒకరు బలవన్మరణానికి పాల్పడటం పై తీవ్రంగా స్పందించారు.

ముంపు బాధితులు మల్లారెడ్డి ఆత్మహత్యకు కెసిఆర్ హరీష్ బాధ్యత వహించాలని షర్మిల డిమాండ్ చేశారు.అసలు ముంపు బాధితులకు పరిహారం చెల్లించే విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ షర్మిల ఫైర్ అయ్యారు.

అయితే ఏపీలోనూ పోలవరం ముంపు బాధితుల సమస్య తీవ్రంగా ఉంది.తమను పట్టించుకోవడం లేదంటూ పోలవరం ముంపు బాధితులు ఆందోళన చేస్తూనే ఉన్నారు.ఇటీవల ఎగువ కాపర్ డ్యామ్ పూర్తిచేసి పూర్తిగా నీటికి అడ్డుకట్ట వేయడం, గోదావరి వరద ప్రవాహం పెరుగుతుండటంతో, ఎగువ నుంచి వచ్చే నీరు వెనక్కి ఎగదన్ని ముంపు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

దీనిపై ఆందోళనలు నిర్వహిస్తున్నారు.ఇప్పుడు తాజాగా షర్మిల చేస్తున్న విమర్శలు జగన్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగానే మారాయి.

Advertisement

ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ సమస్య గురించి షర్మిల లేవనెత్తినా, ఇక్కడ జగన్ ఉలిక్కిపడాల్సిన పరిస్థితి నెలకొంది.

తాజా వార్తలు