టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలను చంద్రబాబు పట్టించుకోలేదని ఆయన తెలిపారు.
గతంలో చంద్రబాబు మత్స్యకారులను సైతం అవమానించారని మంత్రి సిదిరి మండిపడ్డారు.కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాకో హార్బర్ ఏర్పాటు చేశారని తెలిపారు.
వైసీపీ సర్కార్ హయాంలోనే అన్ని రంగాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని చెప్పారు.అలాగే విశాఖలో అన్ని వనరులు ఉన్నాయన్న మంత్రి సిదిరి విశాఖకు రాజధాని వస్తే ఉత్తరాంధ్ర మరింతగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో మరోసారి జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని సూచించారు.







