రైతులకు మేలు చేసే రీతిలో జగన్ సర్కార్ కీలక అడుగు.. !!

ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి మేలు చేసే రీతిలో వైయస్ జగన్ సర్కార్ వైయస్ఆర్ జలకళ పథకాన్ని మరింత ప్రయోజనకరంగా మార్చడానికి కసరత్తులు ప్రారంభించింది.

రాష్ట్రంలో బీడు వారిన భూములకు సాగునీటిని అందించడమే లక్ష్యంగా జగన్ సర్కార్ అమలు చేయబోతున్న “వైయస్ఆర్ జలకళ పథకం” తొలుత రాతి నెలలో 120 మీటర్ల లోతుకు మించి బోర్లు వేయరాదని నిబంధన పెట్టుకోవడం జరిగింది.

ఇటువంటి తరుణంలోరాయలసీమ, పల్నాడు ప్రాంతాలలో ఎక్కువ బీడు భారిన  రాతి నెలలు భారీగా ఉండటంతో 1200 అడుగులు లోతు వరకు బోర్లు వేసినా గానీ మీరు పడని పరిస్థితి ఏర్పడింది.దీంతో 120 మీటర్ల నిబంధన వల్ల చాలామంది రైతులకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో ఈ పథకం అమలు విషయంలో కొత్త సవరణలు, సరికొత్త నిబంధనలు తెరపైకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తూన్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు రైతుకు ఉపయోగపడేలా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఈ పథకాన్ని అమలు చేసే రీతిలో అధికారులకి  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

 .

Advertisement
కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

తాజా వార్తలు