ఓదార్పు మళ్లీ మొదలయింది!!

మళ్లీ ఓదార్పు రాజకీయం మొదలయింది…నేనున్నానంటూ.వైఎస్ఆర్ పార్టీ అధినేత…గౌరవ ప్రతిపక్ష నేత జగన్ యాత్రకు నడుం కట్టారు.

 Jagan Odarpu Stats Again-TeluguStop.com

గతంలో కూడా దివంగత నేత వైఎస్ఆర్ మరణానంతరం ఆయన ఓదార్పు యాత్ర చేశారు.అయితే ఆ యాత్రలో వైఎస్ మరణంతో చనిపోయిన వారిని పరామర్శించే క్రమంలోనే .తన తండ్రి విగ్రహాల ఆవిష్కరణ, అదేవిధంగా సానుభూతి రాజకీయం ఇలా ఎన్నో పనులను చక.చకా ముగించేశారు.అయితే పాపం ఫలితం మాత్రం శూన్యం అనే చెప్పాలి…చివరకు అధికారం దక్కకపోగా…ఇంకా ఆయన యాటర్లు చేసుకోవడానికే పరిమితం అయ్యారు.ఇదిలా ఉంటే…గత కొంతకాలంగా జగన్ రైతులపై ప్రేమ కురిపిస్తూ గోదావరి జిల్లాల్లో ధీక్ష ప్రారంభించారు.

దానికి పెద్దగా స్పందన లేకపోవడంతో ఏదో ఒకటి చెయ్యాలి అన్న క్రమంలో ఇప్పుడు రైతు ఓదార్పు యాత్రను చెప్పట్టనున్నట్లు తెలుస్తుంది.ఈనెల 11 నుంచి ఏపీలో ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు జగన్.

అనంతపురం జిల్లా నుంచి రైతు ఓదార్పు యాత్ర చేయనున్నారు.తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే జగన్ సోదరి షర్మిల పరామర్శ యాత్ర ను కొనసాగిస్తున్నారు.

జగన్ రైతు ఓదార్పు యాత్ర తో ఏపీలో అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు.ప్రస్తుతం వైసీపీ లెక్కల ప్రకారం ఏపీలో దాదాపు 85 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెబుతున్నారు.

అయితే ఆయా కుటుంబాలను నేరుగా వెళ్లి పరామర్శించడంతో పాటు వారిని ఆర్థికంగా ఆదుకోవాలని నిర్ణయించారు.ఏది ఏమైనా…కనీసం ఈ సరైన ప్రజలు జగన్ కు మద్దతుగా నిలుస్తారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube