తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక అందరి చూపు ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ పైనే పడింది.ఏపీ ఎలక్షన్స్ ( AP Elections ) లో ముఖ్యంగా ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపి, జనసేన, కాంగ్రెస్, బిజెపి వంటి పార్టీల లో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు నాయకులు.
అయితే ఎన్నికలు వచ్చాయ్ అంటే చాలు కొన్ని కొత్త పార్టీలు పుట్టుకు వస్తూ ఉంటాయి.అయితే తాజాగా ఏపీలో కూడా అలాంటి పార్టీలే పుట్టుకొస్తున్నాయి.
తాజాగా సినీ ప్రొడ్యూసర్ సత్యారెడ్డి ( Sathyareddy ) తెలుగు సేన అనే ఒక కొత్త పార్టీని స్థాపించారు.అయితే ఈ పార్టీ పెట్టిన కొద్ది గంటలకే మరొక పార్టీ కూడా పెడుతున్నారంటూ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
మరి ఇంతకీ ఆ కొత్త పార్టీని పెట్టే ఆ పొలిటికల్ లీడర్ ఎవరో కాదు మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ.ఈయన 2019 ఎన్నికల్లో ఉన్న సమయంలోనే స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేశారు.
అయితే రాజకీయాల్లో రాణించడం కోసమే ఆయన రాజీనామా చేశారు అంటూ ప్రచారం జరిగింది.ఇదంతా పక్కన పెడితే తాజాగా జెడి లక్ష్మీనారాయణ ( JD Lakshmi Narayana ) ఏపీ ఎన్నికల్లో బరిలో నిలవబోతున్నాం అంటూ సంకేతాలు ఇస్తున్నారట.
ఆయన కొత్తగా జై భారత్ పార్టీ అనే కొత్త పార్టీని స్థాపించినట్లు సమాచారం.అయితే కొత్త పార్టీ పెట్టడానికి అన్ని రకాల పనులు పూర్తి చేసుకున్నాకనే ఈ విషయాన్ని చెప్పడానికి రెడీ అయ్యారట.

ఇక కొత్త పార్టీకి సంబంధించి అన్ని రకాల పనులు పూర్తి చేసుకున్నారట.ఇక ఈరోజు సాయంత్రం ఏడున్నర గంటలకి విజయవాడ ఎగ్జిక్యూటివ్ క్లబ్లో కొత్త పార్టీకి సంబంధించి కొత్త పార్టీని జెడి లక్ష్మీనారాయణ ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.అయితే మొదట్లో లక్ష్మీనారాయణ జనసేన ( Janasena ) పార్టీలో చేరుతారని ప్రచారం జరిగినప్పటికీ అది జరగలేదు.ఇక ఈయన తన కొత్త పార్టీకి సంబంధించిన పేరుని గత సంవత్సరమే ఎన్నికల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలుస్తోంది.

అలాగే ఈసారి విశాఖ నుండి ఎంపీ ఎలక్షన్స్ లో బరిలో ఉంటారనే ప్రచారం కూడా జరిగింది.ఇక జె డి లక్ష్మీనారాయణ కొత్త పార్టి గురించి ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇక ఈయన కొత్త పార్టీ పెట్టడం వల్ల ఏ పార్టీకి నష్టమో ఏ పార్టీకి లాభమో అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.మరి చూడాలి ఈయన కొత్త పార్టీని ప్రకటిస్తారో లేదో.