ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న చాలా నిర్ణయాలు దేశవ్యాప్తంగా హైలెట్ అవుతున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్న జగన్ ప్రభుత్వానికి ఇటీవల ఏపీ ప్రజలు పంచాయితీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నిరాజనాలు పట్టడం అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ సర్కార్ మరింత స్పీడ్ పెంచుతూ భారీ స్థాయిలో ఏపీ ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ ఉంది.
ఈ ఏడాదిలో ఏ టైంలో ఏ పథకం రిలీజ్ అవుతుంది ఇటీవల సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది.
వచ్చే ఉగాది పండుగ నాడు ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించి క్యాలెండర్ రిలీజ్ చేయనుంది.ఇదిలా ఉంటే తాజాగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు సరికొత్త గుడ్ న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం.
మేటర్ లోకి వెళ్తే లక్షకుపైగా ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాలను ప్రభుత్వ ఉద్యోగస్తులకు అందించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.ఈ నేపథ్యంలో ఇప్పటికే మోటార్ సైకిల్, స్కూటర్ తయారీ సంస్థల నుండి గ్రిడ్లు ఆహ్వానిస్తూ ఉండగాఏప్రిల్ 10 నాటికి బ్రీడింగ్ ప్రక్రియ పూర్తి కానుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నట్లు దీనివల్ల టూవీలర్ కంపెనీలకు కూడా 500 నుంచి వెయ్యి కోట్ల వరకు ఆదాయం లభించనుంది.