ఏపిలో సంక‌ల్ప‌సాధ‌నకు స‌ర్వం సిద్దం

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితాలు ప‌డిపోవ‌టం, క్ర‌మంగా విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్డానికి త‌గిన‌ నిఘా, పర్యవేక్షణలు విద్య‌శాఖ‌లో లేకపోవడమేన‌ని గుర్తించిన ప్రభుత్వం సాంకేతిక పర్యవేక్షణ జ‌రిగేలా దృష్టి సారించింది.ఏపిలోని విద్యాశాఖ అధికారులకు ట్యాబులు అందించి , పాఠశాలలపై నిశిత నిఘా పెట్టాల‌ని నిర్ణ‌యించింది.

 Ap Govt Ready For Sankalpa Sadhana-TeluguStop.com

ఇప్ప‌టికే సర్వశిక్షా అభియాన్‌ పరిధిలో ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు 30 జీబీ సామర్థ్యంతో త్రీజీసిమ్‌లతో కూడిన ట్యాబులు అందజేశారు.పాఠ‌శాల‌ల‌ ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రోజూవారీ మధ్యాహ్న భోజన పథకం వివరాలు, అభివృద్ధి ప్రణాళికలు, పాఠశాలల్లో అమలు చేస్తున్న కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచాలి.

వీటిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేశారు.వీటిని సంక‌ల్ప‌సాధ‌న పేరుతో యాప్‌ అందుబాటులోకి తెచ్చి అంతర్జాలంలో నిక్షిప్తం చేస్తారు.

ట్యాబులకు జీపీఎస్‌ విధానంతో అనుసంధానం చేయడంతో పాఠశాల వద్ద నుంచే వివరాలు నమోదు చేసేవిధంగా కూడా ఏర్పాట్లు చేశారు.ట్యాబుల్లో స్కైబ్‌ను కూడా డైన్‌లోడ్‌ చేసి దానిద్వారా వీడియో కాల్‌ద్వారా హెచ్‌ఎంలు ఉన్నతాధికారులతో నేరుగా మాట్లాడే సౌల‌భ్యం ఉంటుంది.దీంతో ఏపిలోని విద్యాశాఖ పూర్తి ప్ర‌క్షాళ‌న జ‌రిగి,, విద్యావిధానం గాడిలో పెట్ట‌డ‌మే కాక విద్యార్టుల‌ నైపుణ్యత ఆధారంగా శిక్ష‌ణ ఇచ్చేదుకు వీలు క‌లుగుతుంద‌ని అధికారులు భావిస్తున్నారు.ప్ర‌భుత్వం ఎంతో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కోర్చి తీసుకువ‌స్తున్న ఈ సంక‌ల్ప‌సాధ‌న ప‌థ‌కాన్ని ఉపాధ్యాయులెంత వ‌ర‌కు స‌హ‌క‌రిస్తార‌న్న‌ది వేచిచూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube