అప్పుడు వైఎస్‌ మరణంలో రిలయన్స్‌ పాత్ర.. ఇప్పుడు జగన్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోవడంపై అప్పట్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి.ఆయన తనయుడు జగన్మోహన్‌రెడ్డి అయితే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీయే ఈ పని చేయించారని సంచలన ఆరోపణలు చేశారు.

 Jagan Governament Close Thereliance Rajashekar Reddycase-TeluguStop.com

తనకు బెయిల్‌ వచ్చిన తర్వాత ఈ ఆరోపణలు మళ్లీ చేయలేదు.

Telugu Apformar, Jagan, Jaganclose, Tuni Kapu Riots, Ysjagan-

అయితే వైఎస్‌ మరణంలో రిలయన్స్‌ పాత్ర ఉందన్న పుకార్లు కూడా ఆ మధ్య వచ్చాయి.ఆ సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో పెను విధ్వంసమే జరిగింది.రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌, జగన్‌ అనుచరులు రిలయన్స్‌ స్టోర్లపై దాడులు చేశారు.

అప్పట్లో ఈ దాడులు చేసిన వాళ్లపై కేసులు కూడా నమోదయ్యాయి.అయితే ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఆ దాడులకు పాల్పడిన వాళ్లపై ఉన్న కేసులను ఎత్తేయడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రిలయన్స్‌పై దాడులే కాదు.కాపు ఉద్యమం సందర్భంగా తునిలో జరిగిన విధ్వంసం తాలూకు కేసులను కూడా ఎత్తేయాలని జగన్‌ సర్కార్‌ భావిస్తున్నట్లు సమాచారం.దీనిపైనే కేబినెట్‌లోనూ చర్చించనున్నట్లు తెలుస్తోంది.రిలయన్స్‌ దాడుల సంగతి పక్కన పెడితే.

తునిలో జరిగిన ఘటన చాలా తీవ్రమైనది.కాపు ఉద్యమ ముసుగులో అరాచక శక్తులు వీరంగం సృష్టించారు.

Telugu Apformar, Jagan, Jaganclose, Tuni Kapu Riots, Ysjagan-

ఓ రైలును, పోలీస్‌ స్టేషన్‌ను తగులబెట్టారు.పోలీసులపై దాడి చేశారు.అప్పుడు చంద్రబాబు అధికారంలో ఉండటంతో ప్రతిపక్ష వైసీపీయే ఈ పని చేయించిందన్న ఆరోపణలు వచ్చాయి.ఇప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులను ఎత్తేయాలన్న ఆలోచన చేస్తుండటం ఆ ఆరోపణలకు మరింత ఊతమిస్తోంది.

సాధారణంగా ప్రజా ఉద్యమంలో భాగంగా నమోదైన కేసులను ఎత్తేయడం సహజం.తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల సందర్భంగా నమోదైన కేసులను ఇలాగే ఎత్తేశారు.

కానీ ఇలాంటి విధ్వంసాలు సృష్టించిన వారిపై కూడా కేసులను ఎత్తేయాలన్న ఆలోచన చేయడం భవిష్యత్తులో ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube