జగన్ ఎఫెక్ట్ :  సినిమా థియేటర్లన్నీ ముసుకోవాల్సిందేనా ?

ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఎప్పుడూ ఏదో ఒక సంచల నిర్ణయం తీసుకుంటూనే ఉన్నారు .

జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం అవుతుండగా మరికొన్ని ప్రశంసలు కురిపిస్తున్నాయి.

అయితే తాజాగా తీసుకున్న నిర్ణయం తో ఏపీ వ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతపడే పరిస్థితిని తీసుకు వచ్చినట్లుగా కనిపిస్తోంది.దీనికి కారణం ఆన్లైన్ ద్వారా టికెట్లను అమ్మాలని, అది కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతుందనే ప్రకటన సినిమా థియేటర్ల యాజమాన్యాలకు ఆగ్రహం కలిగిస్తోంది.

         సినిమా టికెట్లను అమ్మగా వచ్చిన సొమ్ములను ఒకరోజు అనంతరం యాజమాన్యాలకు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. జూలై 1 నుంచి థియేటర్లలో సినిమా టికెట్ల అమ్మకాలన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉండబోతున్నాయి.

దీంతో సినిమా టికెట్ల విషయంలో థియేటర్ల యాజమాన్యాల పాత్ర నామమాత్రం కాబోతూ ఉండడం, పూర్తిగా ప్రభుత్వం గుప్పిట్లోకి థియేటర్లు వెళ్ళిపోతూ ఉండడం తో ఇప్పటికే సవాలక్ష ఇబ్బందులతో ఉన్న థియేటర్ల యాజమాన్యాల పరిస్థితి దారుణం గా మారబోతోంది.ఇప్పటికే థియేటర్లకు వచ్చేవారి సంఖ్య గతంతో పోలిస్తే బాగా తగ్గుముఖం పట్టింది.

Advertisement

ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సినిమా థియేటర్ల యాజమాన్యాలకు కూడా ఆగ్రహం కలిగిస్తోంది.అందుకే ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు ఎవరు ముందుకు రావడం లేదు.   

   తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని సినిమా థియేటర్లను మూసివేయాలని థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించాయి.ఈ మేరకు జిల్లాలోని ఎగ్జిబిటర్లు అందరూ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ నిర్ణయం కనుక అమలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా థియేటర్లన్నీ మూసివేసి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేసేందుకు థియేటర్ల యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి.

అయితే కొత్త విధానంతో థియేటర్ల యాజమాన్యం కు ఎటువంటి నష్టం ఉండదని ప్రభుత్వం నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా, అంతిమంగా నష్టపోవాల్సి వస్తుందనే ఆగ్రహంతో థియేటర్ల యాజమాన్యాలు ఉన్నాయి.ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోకపోతే ఇక తాము థియేటర్లను పూర్తిగా మూసివేస్తామని హెచ్చరికలు థియేటర్ల యాజమాన్యాలు చేస్తున్నాయి.

ఈ విషయంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో.?.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు