జగన్‌ మనసు మార్చుకున్నాడు, టీడీపీ ఖతమేనా?

తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వైకాపా నుండి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు జాయిన్‌ అయిన విషయం తెల్సిందే.

వైకాపాలో గెలిచిన ఎమ్మెల్యేలు పలువురు తెలుగు దేశం ప్రభుత్వంలో మంత్రులుగా కూడా చేశారు.

ఆ విషయమై గవర్నర్‌ మరియు రాష్ట్రపతులకు జగన్‌ ఎంతగా విన్నవించినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది.తాను సీఎం అయిన తర్వాత అంలాటి పరిస్థితులు తీసుకు రాను అని, రాజ్యాంగబద్దంగా తమ పార్టీలోకి రావాలంటూ జగన్‌ సూచించాడు.

ఎవరైనా తమ పార్టీలోకి రావాలంటే ఆ పార్టీకి మరియు పదవులకు రాజీనామా చేసి రావాలంటూ ముందే ప్రకటించాడు.జగన్‌ ప్రకటన కారణంగా పలువురు నాయకులు బీజేపీ దారి పట్టారు.

కాని ఇప్పుడు పార్టీ బలోపేతం మరియు టీడీపీని దెబ్బ కొట్టే ఉద్దేశ్యంతో జగన్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.తెలుగు దేశం పార్టీ నుండి కొందరు సీనియర్లకు వైకాపా గాలం వేస్తుందనే చర్చ జరుగుతోంది.

Advertisement

ఎమ్మెల్యేలు కూడా జగన్‌ ఓకే అంటే వచ్చేందుకు సిద్దంగా ఉన్నారు.ఇదే నిజం అయితే తెలుగు దేశం పార్టీకి కనీసం 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగిలే పరిస్థితి లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి జగన్‌ సై అంటూ తన పార్టీ డోర్‌ ఓపెన్‌ చేస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు