ఏసీబీ లో పనిచేస్తున్న సిబ్బందికి అలసత్వం ఉండకూడదు.అవినీతి నిరోధానికి కాల్ సెంటర్ ఏర్పాటు వెనుక మంచి కారణాలు ఉన్నాయి.
కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపించాలి.ఏ శాఖలోనూ అవినీతి అనేది కనిపించకూడదు.
లంచం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి రావాలి.లంచం అనేది లేకుండా చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది.
మీకు కావలసిన అంత మంది సిబ్బందిని తీసుకోండి.ఏమి కావాలన్నా ప్రభుత్వం చేస్తుంది.
మీకు మూడు నెలల సమయం ఇస్తున్నాను.మార్పు కనిపించకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఏపీ సీఎం జగన్ ఏసీబీని ఉద్దేశించి అన్నారు.
ఆ శాఖ పనితీరుపై అసంతృప్తితో ఉన్న జగన్ గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేశారు.