బ్యాడ్ గర్ల్‌తో రాఖీ భాయ్ ఐటెం సాంగ్..?

దక్షిణాది చిత్రాల్లో తనకంటూ మాస్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ను ఓ ఊపుఊపేసిన చిత్రం ‘కేజీయఫ్’ ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.

కేజీయఫ్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న కేజీయఫ్ 2 కోసం ప్రేక్షకులు కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ చూస్తున్నారు.ఇక ఈ సినిమాతో హీరో యశ్ ఒక్కసారిగా స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుని పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.

కాగా కేజీయఫ్ 2 చిత్రంలో అన్ని అంశాలు పక్కాగా ఉండేలా చిత్ర యూనిట్ చూస్తోంది.ముఖ్యంగా మాస్ అంశాలతో పాటు మసాలా ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫర్నాండెజ్‌తో ఓ అదిరిపోయే మాస్ ఐటెం సాంగ్ చేయించాలని చూస్తున్నారట.దక్షిణాది వర్షన్‌లో వేరొక భామ నోరా ఫతేహితో ఈ మాస్ మసాలా సాంగ్ చేయించనున్నారట.

Advertisement

బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు జాక్వెలిన్‌ను తీసుకుంటున్నారట.గతంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రంలో ఓ హాట్ సాంగ్‌తో జాక్వెలిన్ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.

మొత్తానికి రెండు వర్షన్‌లలో కూడా ఇద్దరు హాట్ పాపలు ఐటెం సాంగ్‌తో వెండితెరపై ఫైర్ చూపించనున్నట్లు తెలుస్తోంది.ఇక ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందట.

మరి ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఏ రేంజ్‌లో ఉంటుందా, అది ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను.. సోనమ్ కపూర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Advertisement

తాజా వార్తలు