ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )హత్య వెనుక భారత్ హస్తం వుండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.ఈ వ్యాఖ్యలు భారత్, కెనడా సంబంధాలను తీవ్రంగా దెబ్బతీశాయి.
ఇప్పటికే ఇరుదేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించగా.కెనడాలోని వీసా ప్రాసెసింగ్ కేంద్రాన్ని భారత్ మూసివేసింది.
అయితే ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు పంజాబీ గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్యపోరే కారణమని విశ్లేషకులు అంటున్నారు.కెనడాలోని విన్నిపెగ్‌లో ముఠాల మధ్య జరిగిన గ్యాంగ్‌వార్‌లో ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సుఖ్‌దూల్ సింగ్ అలియాస్ సుఖ దునేకేను గత వారం కాల్చి చంపిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.
నకిలీ పత్రాలతో 2017లో కెనడాకు పారిపోయిన దునేకే .దేవిందర్ బంబిహా గ్యాంగ్‌లో( Devinder Bambiha Gang ) కీలక సభ్యుడు.ఇతని హత్య తమ పనేనని ప్రత్యర్ధి గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, జగ్గు భగవాన్‌పురియాలు వేరు వేరుగా ప్రకటించారు.సెప్టెంబర్ 21న దునేకే హత్యకు ఒక రోజు ముందు.
ఎన్ఐఏ విడుదల చేసిన 43 మంది గ్యాంగ్‌స్టర్ల జాబితాలో అతని పేరు వుంది.ఈ ఏడాది జూన్‌లో సర్రేలో జరిగిన ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హతమార్చినట్లుగానే సుఖా దునేకేను చంపారు.
భారత నిఘా సంస్థల ప్రకారం.కెనడా కేంద్రంగా జరుగుతున్న ఖలిస్తాన్ ఉద్యమంలో దునేకే కీలకపాత్ర పోషిస్తున్నాడు.
దేవిందర్ బంబిహా గ్యాంగ్‌లో సభ్యుడైన అతనిపై పంజాబ్‌లో దోపిడీ, హత్యాయత్నం, హత్య కేసులు వున్నాయి.

ఇతని హత్యపై గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్( Lawrence Bishnoi ) సోషల్ మీడియాలో ఇలా రాశాడు.‘‘దునేకే.మా సోదరుడు గుర్లాల్ బ్రార్‌ను హత్య చేశాడు.
విక్కీ మిద్దుఖేరాతో పాటు కబడ్డీ ఆటగాడు సందీప్ నాగల్ అంబియన్‌ను చంపడం వెనుక అతని పాత్ర వుంది’’.మరో సోషల్ మీడియా పోస్ట్‌లో గ్యాంగ్‌స్టర్ భగవాన్‌పురియా కూడా సుఖా దునేకేను చంపింది తామేనని చెప్పాడు.
అయితే నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల ప్రమేయం వుందన్న ఆరోపణల నేపథ్యంలో కెనడాలోని పలు నగరాల్లో సిక్కులు నిరసనలు చేపట్టారు.కాగా.
దునేకే హత్యకు ఏడాది ముందు పంజాబీ ర్యాపర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలాను పట్టపగలు దారుణంగా కాల్చిచంపారు.ఈ హత్య తమ పనేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు, ప్రస్తుతం కెనడాలో వున్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటించాడు.
మూసేవాలా హత్యను బిష్ణోయ్, మరో గ్యాంగ్‌స్టర్ హరీందర్ సింగ్ రిండాతో( Harinder Singh Rinda ) కలిసి నిర్వహించాడు.రిండాకు ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌తో సన్నిహిత సంబంధాలు వున్నాయి.

అలా భారత్‌లో జరుగుతున్న సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు, కెనడాలో జరుగుతున్న హత్యలకు గ్యాంగ్‌వారే ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు.ఈ కోవలోనే హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగి వుండొచ్చని అంచనా.కెనడా ప్రభుత్వం చేపడుతున్న దర్యాప్తులో నిజ్జర్ హత్య వెనుక అసలు దోషులెవరో తేలనుంది.అటు భారత్ కూడా తన ప్రమేయం లేదు అనడానికి తగిన ఆధారాలను అంతర్జాతీయ సమాజం ముందు పెట్టాల్సి వుంటుంది.