టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో ”పుష్ప ది రూల్”( Pushpa The Rule ) ఒకటి.ఈ సినిమా సౌత్ ప్రేక్షకులు మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూసే సినిమాల్లో ముందు వరుసలో ఉంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పటికే అంచనాలు భారీ లెవల్లో ఉన్నాయి.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా పార్ట్ 1 సౌత్ మాత్రమే కాదు నార్త్ వాళ్ళను కూడా ఆకట్టుకుంది.అందుకే ఈసారి పార్ట్ 1 ను మించి తెరకెక్కిస్తున్నారు.దీంతో ఈ సినిమాకు పోటీ లేకుండా సేఫ్ జోన్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ రిలీజ్ డేట్ ను ఖరారు చేసారు.
నిన్ననే ఈ రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా ప్రకటించారు.

ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.అయితే ఈ సినిమాకు ప్రస్తుతానికి ఒక బాలీవుడ్ మూవీ పోటీగా నిలిచింది.బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న సింగం ఎగైన్( Singham Again) సినిమా కూడా అదే రోజున రిలీజ్ కాబోతుంది.
దీంతో ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాల విషయంలో పోటీ తప్పేలా లేదు.అయితే పుష్ప వంటి భారీ సినిమాతో అక్షయ్ కుమార్ ( Akshay Kumar )రాబోతున్నాడు అంటే అది పెద్ద సాహసం అనే చెప్పాలి.
ఈ రెండు ఒకే రోజు అనగానే ఏ హీరో ఎంత రాబడతాడు? మొదటి రోజు ఎవరు రికార్డ్ కలెక్షన్స్ రాబడతారు? అనేది ఇప్పటి నుండే ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు.మరి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అక్షయ్ కుమార్ సింగం డేట్ మార్చుకున్న ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.







