మైనర్లకు (18 ఏళ్లు నిండని పిల్లలకు) వాహనాలు ఇవ్వటం, నడపమని ప్రోత్సహించటం చట్ట రీత్యా నేరం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్ లపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగినదని తల్లిదండ్రులు, వాహన యజమానులు మైనర్ పిల్లలకు వాహనంవాహనాలు ఇవ్వటం, నడపమని ప్రోత్సహించటం వలన తెలిసి తెలియని డ్రైవింగ్ తో వాహనం నడపటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని మైనర్ డ్రైవింగ్ పై జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్( Special drive ) లు నిర్వహించి 361 వాహనాలు సీజ్ చేసి , వాహనాలు నడుపుతు పట్టుబడిన మైనర్లకు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి అవగాహన కల్పించ )డం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కారణం లేని మరణం ఒక రోడ్డు ప్రమాదమే కావున ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించవద్దని, దానితో వారు తెలిసి తెలియని డ్రైవింగ్ తో ప్రమాదాలకు కారణం అవుతున్నారని,తల్లిదండ్రులకు,వాహనాల యజమానులు పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.

పిల్లలు వాహనాల విషయంలో కావాలని తల్లిదండ్రులని బెదిరించిన , తెలియకుండా తీసుకెళ్లిన పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని అట్టి వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందని అన్నారు.పిల్లలకు వాహనాలు ఇవ్వడం వలన ఏదైనా జరగరాని సంఘటనలు జరిగితే కుటుంబం జీవితాంతం బాధపడవలసి వస్తుందని పిల్లలను రోడ్డు ప్రమాదం ద్వారా దూరం చేసుకోవడం కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు తీరని లోటు అన్నారు.

మైనర్ డ్రైవింగ్, రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు గురించి జిల్లాలో అన్ని పాఠశాలల్లో విద్యార్ధిని విద్యార్థులకు రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ కార్యక్రమం ద్వారా విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనల,( traffic rules మైనర్ డ్రైవింగ్ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని, అలాంటి యువత డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్ధాలకు బానిసలై వారి భవిష్యత్తుని నెట్టేసుకుంటున్నారని,అట్టి యువత భవిష్యత్ కాపాడే బాధ్యత మన అందరిపై ఉన్నదని,జిల్లా పరిధిలో గంజాయి మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం అందించి, గంజాయి ,మత్తు పధార్థాల నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ కు సదన్ కుమార్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు,శ్రీనివాస్, ఎస్.ఐ కు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
ఆరోగ్య కేంద్రంలో వరల్డ్ హార్ట్ డే .

Latest Rajanna Sircilla News