గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే సాంకేతిక ఉత్పత్తులను భారతదేశానికి తీసుకువచ్చిన ఇజ్రాయిల్‌కు చెందిన వాటర్‌జెన్‌

స్వచ్ఛమైన తాగునీటిని ప్రతి ఒక్కరికీ చేరువ చేసే తమ లక్ష్యం పునరుద్ఘాటనభారతదేశంలో సురక్షిత తాగు నీటి సమస్య పరిష్కరించడం లక్ష్యం ఇండియా, 26 మే 2022 ః ఇజ్రాయిల్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న వాటర్‌ జెన్‌ సంస్థ గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే సాంకేతికతను విజయవంతంగా ఆవిష్కరించింది.

ఈ సాంకేతికతను భారతదేశానికి తీసుకువచ్చేందుకు ఎస్‌ఎంవీ జైపురియా గ్రూప్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకుంది.

ఈ సాంకేతికతతో అత్యున్నత నాణ్యత కలిగిన, మినరలైజ్డ్‌, సురక్షిత తాగునీటిని గాలి నుంచి ఉత్పత్తి చేయవచ్చు.దీనికి తోడు, భారతదేశంలో మేక్‌ ఇన్‌ ఇండియా ప్రాజెక్ట్‌కు మద్దతునందించడంలో భాగంగా భారతదేశంలో తమ తయారీ కేంద్రం సైతం ప్రారంభించనుంది.

తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలను సైతం అందించనుంది.ఈ కంపెనీ తమ విస్తృతశ్రేణి వాటర్‌ జెన్‌ ఉత్పత్తులను జెన్నీ, జెన్‌–ఎంఐ, జెన్‌ ఎంఐ ప్రో, జెన్‌–ఎల్‌ రూపంలో అందిస్తుంది.

వీటి సామర్థ్యాలు రోజుకు 30 నుంచి 6వేల లీటర వరకూ ఉంటాయి.ఈ ఉత్పత్తుల ధరలు 2.5 లక్షల రూపాయలతో ప్రారంభమవుతాయి.ఈ ఉత్పత్తులు పాఠశాలలు, ఆస్పత్రులు, పార్కులు, రిసార్ట్‌లు, కన్‌స్ట్రక్షన్‌ సైట్లు, తాత్కాలిక ప్రాంతాలకు అనువుగా ఉంటాయి.

Advertisement

ఈ భాగస్వామ్యం గురించి వాటర్‌జెన్‌ ఇండియా సీఈఓ

శ్రీ మయన్‌ ముల్లా

మాట్లాడుతూ ‘‘వాటర్‌జెన్‌ వద్ద మేము మా వినియోగదారుల జీవితాలు సరళంగా, సౌకర్యవంతంగా మార్చే సాంకేతికతలను నమ్ముతుంటాము.ఇండియా మా టాప్‌ 3 వ్యూహాత్మక మార్కెట్‌లలో ఒకటి.

ప్రతి ఒక్కరికీ సురక్షితమైన మినరలైజ్డ్‌ వాటర్‌ను అందించాలని కోరుకుంటున్నాము’’ అని అన్నారు.ఎస్‌ఎంవీ జైపురియా గ్రూప్‌ డైరెక్టర్‌ చైతన్య జైపురియా మాట్లాడుతూ ‘‘భారతదేశంలో అధిక శాతం మంది ప్రజలు స్వచ్ఛమైన, సహజసిద్ధమైన తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు.

వాటర్‌ జెన్‌ యొక్క వినూత్న పరిష్కారాలు ఈ సమస్యలకు తగిన పరిష్కారాలను చూపగలవు.వాటర్‌ జెన్‌ ఉత్పత్తులతో సురక్షిత తాగునీటిని మేము అందించగలమని నమ్ముతున్నాము’’అని అన్నారు.

వైరల్ : తల్లిదండ్రుల ప్రేమకు మించి మరొక ప్రేమ లేదనడానికి ఇదే ఉదహరణ కాబోలు..
Advertisement

తాజా వార్తలు