రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సర్వ సాధారణమే అయినా వాటిని నిరూపించి తగిన ఆధారాలు సంపాదించాలంటే మాత్రం చాలా పెద్ద పని.ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రతి విషయంలోనూ బాగా ఆరితేరిపోవడంతో ఎక్కడ ఎటువంటి ఆధారం లేకుండానే చాప కింద నీరులా తమ పనులను చక్కబెట్టుకుంటారు.
ఆ విధంగానే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎక్కడ లేని అవినీతి అక్రమాలు భూ కుంభకోణాలు జరిగిపోయాయని, చంద్రబాబు తనకు అనుకూలమైన విధంగా చట్టాలను అమలు చేశాడని వైసిపి ముందు నుంచి ఆరోపణలు చేస్తూ వచ్చింది.అయితే ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.
ఈ నేపథ్యంలో టిడిపి ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అన్ని అవినీతి, అక్రమాలను బయట పెట్టే చాన్స్ జగన్ ప్రభుత్వానికి ఉంది.అయినా టిడిపిని ఇరుకున పెట్టే ఏ ఒక్క ఆధారాన్ని వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు సంపాదించలేకపోయింది.
దీన్ని టిడిపి తనకు అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధమవుతోంది.
టిడిపి అధికారంలో, వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ టెండర్ల విషయంలో అవినీతి అక్రమాలు జరిగాయని, వేలాది కోట్లు చంద్రబాబు తనకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు దోచుకు పెట్టారని జగన్ ఆ పార్టీ నాయకులు అప్పట్లో ఆరోపణలు చేశారు.
ప్రస్తుతం వైసిపి మీ పాలన సాగుతోంది.జగన్ అధికారంలోకి రాగానే పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చి సంచలనం సృష్టించాడు.దీనిపై ప్రతిపక్షాలు కేంద్రం నుంచి ఎన్ని అభ్యంతరాలు, బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గలేదు.ఇక టిడిపి హయాంలో పోలవరంపై తాము చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేందుకు నిపుణులతో కమిటీని నియమించారు.
కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన వివరాలు ఇవి బయట పెట్టలేకపోయారు.

అలాగే ఏపీ రాజధాని అమరావతి విషయంలో పెద్ద ఎత్తున ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగినట్టు వైసీపీ అప్పట్లో ఆరోపణలు చేసింది.ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణ పనులను నిలుపుదల చేసి వాటిపై జరిగిన లావాదేవీలు అన్నిటిని బయట పెట్టేందుకు నిపుణుల కమిటీని వేశారు.దీంతోపాటు సి ఐ డి సిబ్బంది కూడా రాజధాని గ్రామాల్లో రకరకాల విచారణలు చేశారు.
అయినా ఇప్పటికీ ఏ విషయము తేల్చలేదు.విశాఖ భూ కుంభకోణం విషయంలోనూ ఇదే తంతు వైసిపి కొనసాగిస్తూ ఉంది.
ఇప్పటి వరకు అన్ని విషయాల్లోనూ కేవలం విచారణలతోనే జగన్ సరిపెడుతున్నారు తప్ప ఏ విషయంలోనూ టిడిపిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయలేకపోతోంది.