తల్లి చెల్లి అంతా కలిసి రాబోతున్నారా ? జగన్ ఆ ముద్ర పోతుందా ?

ఏపీ సీఎం జగన్ దృష్టి మొత్తం రాబోయే సార్వత్రిక ఎన్నికలపైనే ఉంది.

సాధారణ ఎన్నికలకు వెళ్లినా, ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఖచ్చితంగా మరోసారి ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనే ధీమాతో జగన్ ఉన్నారు.

దీనికి తగ్గట్లుగా పార్టీ శ్రేణులు, ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ నిత్యం జనాల్లో ఉండే విధంగా జగన్ రూట్ మ్యాప్ ఇచ్చారు.ఇక తాను రచ్చబండ కార్యక్రమం పేరుతో జనాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా, వేలాది కోట్లను జనాల ఖాతాల్లోకి వివిధ పథకాల పేరుతో అందిస్తున్న ఏదో తెలియని అసంతృప్తి ప్రభుత్వంపై ఉంది అనే విషయాన్ని జగన్ గుర్తించారు.ప్రస్తుతం దాన్ని పోగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు .ప్రతిపక్షాలు ఎప్పుడూ ఏదో ఒక విమర్శలు చేయడం పరిపాటే అయినా, జగన్ కుటుంబం పైన, ఆయన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య అంశం పైన పదేపదే విమర్శలు చేస్తున్నాయి.ముఖ్యంగా జగన్ తన తల్లిని చెల్లిని దూరం పెట్టారని, కుటుంబంలో విభేదాలు ఉన్నాయని, అందుకే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకోగా విజయమ్మ వైసిపి గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారని టిడిపి జనసేన వంటి పార్టీలు పదేపదే ప్రచారం చేస్తూ, జనాల్లోకి వాటిని బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఈ విషయంలో జనాలలోను ఇదే రకమైన అభిప్రాయం ఉండడంతో పాటు, జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డ హత్య నిందితులను జగన్ కాపాడుతున్నారు అనే ప్రచారం జరుగుతుండడం , తదితర అంశాలపై జగన్ సీరియస్ గా దృష్టి పెట్టారు.ఏపీలో ఎన్నికల సమయం నాటికి తెలంగాణలో ఎన్నికలు ముగిస్తాయని, అప్పుడు షర్మిల విజయమ్మ ఇద్దరూ వైసీపీకి అండగా నిలబడతారని, వైసీపీ కీలక వ్యక్తులు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

విజయమ్మ నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, షర్మిల మాత్రం వైసీపీని గెలిపించాల్సిందిగా ప్రకటనలు ఇవ్వడంతో పాటు, మీడియా, సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది.ఇక తన బాబాయ్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతకు వైసిపి టికెట్ ఇచ్చి ఎన్నికల్లో పోటీకి దింపాలని, తద్వారా తను బాబాయ్ హత్య వ్యవహారంలో ప్రత్యర్థుల నోళ్లకు మూతలు వేయించాలని జగన్ నిర్ణయించుకున్నారట.ఈ మేరకు సునీతతోను చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న జగన్ కు ఇప్పుడు కుటుంబ సభ్యులు కలిసి వస్తే  ఆయనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టినట్లు అవ్వడంతో పాటు, అదనకు బలం చేకూరినట్టు అవుతుందని, కుటుంబం అంతా జగన్ వెంటే నడుస్తున్నారనే సంకేతాలు జనాల్లోకి వెళ్తాయని జగన్ భావిస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు