కీలక రాజకీయాలకు కేంద్రంగా, ప్రశాంతమైన వాతావరణానికి కేంద్రంగా ఉన్న నెల్లూరు జిల్లాను వైసీపీ నేతలు భ్రష్టు పట్టిస్తున్నారా? వారి ఫ్యాక్షన్ రాజకీయాలతో ఇక్కడ అలజడి రేగుతోందా? ఇక్కడ నెల్లూరు రాజకీయాలు వైసీపీ నేతలతో కలుషితం అవుతున్నాయా? అంటే.మెజారిటీ ప్రజలు ఔననే అంటున్నారు.
నెల్లూరురూరల్, సిటీ వంటి కీలక నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు పట్టం కట్టారు.అయితే, ఇక్కడ గెలిచిన నాయకులు ఇక్కడి ప్రజల అభివృద్ధిని పక్కన పెట్టి కుళ్లు రాజకీయాలకు తెరదీస్తున్నారు తాము తప్ప ఎవరూ ఇక్కడ నుంచి పోటీ చేయరాదని, తాము ఇక్కడి ప్రజలకు మరో నాయకుడు ఉండరాదనే రీతిలో ఇక్కడి ప్రజలను వంచిస్తున్నారు.

ఈ రెండు నియోజకవర్గాలనూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు సిటీ నుంచి మంత్రి నారాయణ కు, రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్‌రెడ్డికి టికెట్లను కన్ఫర్మ్ చేశారు.అయితే, దీనిని ఓర్చుకోలేక పోతున్న వైసీపీ నాయకు లు ఇక్కడ అలజడి సృష్టించి ప్రశాంత వాతవారణాన్ని భగ్నం చేస్తున్నారు.నిజానికి ఈ రెండు నియోజకవర్గాల్లోనూ టీడీపీ గెలవక పోయినా.అభివృద్ధి కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తోంది.అయితే, వైసీపీ నాయకులు మాత్రం అభివృద్ధి జరిగితే.తాము ఎక్కడ వెనుకబడి పోతామోనని భయపడుతూ.
కుళ్లు రాజకీయాలకు తెరదీశారు.అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు.
అభివృద్ధి ఎందుకు ఆ నిధులు తమకే ఇవ్వాలని గోల పెడుతున్నారు.

ఇక, తాజాగా ఇక్కడ రోడ్డున పడి రాజకీయలను మరింత వేడెక్కించారు వైసీపీ నేతలు.జిల్లాలోని వెంకటగిరికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.వెంకటగిరిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరిగింది.అయితే… ఈ బస్సుయాత్రను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.రాష్ట్రాన్ని విభజించిన పాపం కాంగ్రెస్ పార్టీదేనని, ఆపార్టీ నేతలకు బస్సుయాత్ర నిర్వహించే అర్హత లేదంటూ వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.దీంతో పోలీసులు కల్పించుకుని వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు.కాగా… బస్సు యాత్రను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదుచేయగా ప్రస్తుతం వారు పరారీలో ఉండగా వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.తాజాగా నెల్లూరు సిటీలోనూ ఇదే తరహా అలజడికి ప్లాన్‌చేసి జిల్లాకు ఉన్న మంచి పేరును వైసీపీ నేతలు చెడగొడుతున్నారని మెజారిటీ ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు.దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కవని అంటున్నారు.