రజినీకాంత్ బాగు కోసమే విజయ్ సినిమాలు చేస్తున్నాడా..? పాపం అభిమానుల రియాక్షన్ ఏంటో!

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ సూపర్ స్టార్ రజినీకాంత్ కి మేలు చేసేందుకే చేస్తున్నాడట.

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న ట్రోల్ ఇది.

తమిళనాడు లోని యంగ్ ఏజ్ డైరెక్టర్స్ అందరూ మిగిలిన హీరోలతో అద్భుతంగా సినిమాలు చేస్తున్నారు కానీ, తలపతి విజయ్ దగ్గరకి వచ్చేసరికి యావరేజి సినిమాలను మాత్రమే అందిస్తున్నారు.భారీ అంచనాల నడుమ విడుదలైన రీసెంట్ చిత్రం లియో( Leo ) కి డివైడ్ టాక్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఫస్ట్ హాఫ్ అద్భుతంగా తీసాడు కానీ, సెకండ్ హాఫ్ చాలా సిల్లీ గా తీసాడంటూ సోషల్ మీడియా మొత్తం ఒక రేంజ్ లో నెగటివ్ టాక్ వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే.అయితే విజయ్ కి ఉన్న క్రేజ్ అలాగే మూవీ మీద కాంబినేషన్ క్రేజ్ కారణంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది.

నాలుగు రోజుల్లో దాదాపుగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది అట ఈ చిత్రం.డివైడ్ టాక్ వస్తేనే ఈ రేంజ్ లో ఆడుతుంది అంటే, ఇక పాజిటివ్ టాక్ వస్తే విద్వంసం ఏ రేంజ్ లో ఉండేదో ఊహించుకోవచ్చు.కానీ రజినీకాంత్ ,కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్స్ కి అద్భుతమైన సినిమాలను అందించే డైరెక్టర్స్ విజయ్ విషయం మాత్రం చేతులు ఎత్తేస్తున్నారు.

Advertisement

ఖైదీ( Kaithi ) లాంటి అద్భుతమైన సినిమాని అందించిన లోకేష్ కనకరాజ్, విజయ్ కి మాత్రం కేవలం మాస్టర్ అనే ఎబోవ్ యావరేజ్ సినిమా ని ఇచ్చాడు.సోషల్ మీడియా లో లోకేష్ ఈ విషయం లో విమర్శలు కూడా ఎదురుకున్నాడు.

కానీ ఆ తర్వాత ఎలా అయినా గ్రాండ్ కం బ్యాక్ ఇవ్వాలనే కసితో విక్రమ్ చిత్రం తీసాడు.ఫలితం ఎలా వచ్చిందో మనమంతా చూసాము.

డాక్టర్ సినిమాతో ఇండస్ట్రీ ని షేక్ చేసిన ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఇదే కోవలోకి వస్తాడు.విజయ్ తో బీస్ట్ లాంటి అట్టర్ ఫ్లాప్ సినిమాని తీసిన నెల్సన్, తన తదుపరి చిత్రం పై ప్రత్యేక ద్రుష్టి పెట్టి జైలర్ చిత్రం చేసాడు.ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ అనేది మన అందరికి తెలిసిందే.

ఇప్పుడు లోకేష్ కనకరాజ్ కూడా లియో చిత్రం తర్వాత రజినీకాంత్ తో సినిమా చెయ్యబోయే సినిమా కూడా చాలా కసిగా మనసుపెట్టి చేస్తాడు.ఇలా ఈ యంగ్ డైరెక్టర్స్ లో కసి నింపేందుకే విజయ్ సినిమాలు చేస్తున్నాడని సోషల్ మీడియా లో గత నాలుగు రోజుల నుండి ట్రోల్ల్స్ పడుతున్నాయి.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు