కిషన్ రెడ్డిపై దుష్ప్రచారం వెనుక గులాబీ పార్టీ ?

బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై పార్టీలో కొందరు తిరుగుబాటు చేస్తున్నారు.తీవ్రంగా విమర్శిస్తున్నారు.

మొన్న ఎమ్మెల్యే రాజా సింగ్ కిషన్ రెడ్డి మీద తీవ్రంగా ఆరోపణలు చేసి, ఆయన్ని ప్రసిడెంట్ పోస్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేశాడు.గతంలో కూడా కొందరు ఆరోపణలు చేశారు.

ఇలాంటి వారి వెనుక గులాబీ పార్టీ ఉందని కిషన్ రెడ్డి విధేయులు అనుమానిస్తున్నారు.ఆ పార్టీ నాయకులు ఒక పథకం ప్రకారం దుష్ప్రచారం చేయిస్తున్నారని నమ్ముతున్నారు.

ఎమ్మెల్యే రాజా సింగ్ మీద పార్టీ క్రమశిక్షణ సంఘం విచారణ జరుపుతోంది .ఒకవేళ ఏమైనా చర్యలు తీసుకుంటే అతను గులాబీ పార్టీలోకి వెళ్ళవచ్చని అనుకుంటున్నారు.పార్టీ నాయకులే కాకుండా రాజకీయ పరిశీలకులు కూడా ఇదే ఊహిస్తున్నారు.

Advertisement

టీడీపీ -బీజేపీ బంధాన్ని విడగొట్టి కాషాయ పార్టీతో కలవాలని గులాబీ పార్టీ ప్లాన్ చేస్తోందని అనుకుంటున్నారు.గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి.ఆ నేపధ్యంలోనే గులాబీ పార్టీ కిషన్ రెడ్డి మీద దుష్ప్రచారం చేయిస్తున్నదని అనుమానిస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాదులో గులాబీ పార్టీకి ఇప్పటివరకు స్థానం లేదు.వచ్చే ఎలాగైనా గెలవాలని గులాబీ పార్టీ పట్టుదలగా ఉంది.

దీంతో ఇలాటి ట్రిక్కులు చేస్తోందని భావిస్తున్నారు.కిషన్ రెడ్డి టీడీపీకి అనుకూలుడు కాబట్టి అతన్ని తొలగింప చేస్తే బీజేపీతో దోస్తీ చేయవచ్చని గులాబీ పార్టీ భావిస్తోందట.

రాజకీయాల్లో ఇలాంటి వ్యూహాలు పన్నడం అసాధారణం కాదు.

ఒక్క ఇంటర్వ్యూతో బాబును చిత్తు చేసిన జగన్.. వ్యూస్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు