దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును అందుకోవడంతో ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇలా ఈ సినిమా లోని ఈ పాటకు ఆస్కార్ అవార్డు(Oscar Award) రావడంతో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి(MM Keeravani) అలాగే పాట రచయిత చంద్రబోస్ ఆస్కార్ వేదిక పైకి వెళ్లి అవార్డును అందుకున్నారు.
ఇక ఈ వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మాట్లాడడం చంద్రబోస్ మాత్రం మౌనంగా ఉన్నారు.ఇక చివరిలో మన ఇండియన్ స్టైల్ లో నమస్తే అంటూ వేదికను వీడారు.
ఈ విధంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్నటువంటి చంద్రబోస్(Chandra Bose) కనీసం రెండు ముక్కలు కూడా మాట్లాడకపోవడంతో అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ చంద్రబోస్ ఏదైనా మాట్లాడి ఉంటే బాగుండేది అని భావిస్తున్నారు.అయితే చంద్రబోస్ ఆస్కార్ వేదికపై మాట్లాడకపోవడానికి గల కారణం ఉందని తెలుస్తోంది.మరి చంద్రబోస్ ఆస్కార్ వేదికపై మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.ఆస్కార్ నిబంధనల ప్రకారం ఒక చిత్రానికి ఎంతమంది ఆస్కార్ గెలుచుకున్నప్పటికీ ఒక్కరే మాట్లాడాలని నిబంధన ఉండడంతో ఈ వేదికపై కీరవాణి మాట్లాడగా చంద్రబోస్ మౌనంగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఆస్కార్ విజేతలకు వేదికపై మాట్లాడటానికి కేవలం 45 సెకండ్ల టైం మాత్రమే కేటాయించడం వల్ల కీరవాణి ఒక్కరే మాట్లాడారని తెలుస్తోంది.ఇలా ఆస్కార్ అకాడమీ నిబంధనల ప్రకారమే ఆయన మాట్లాడలేకపోయారని ఇక చివరిగా నమస్తే అంటూ చంద్రబోస్ ఆస్కార్ వేదికను వీడారని తెలుస్తోంది.ఇక ఈయన వేదికపై మౌనంగా ఉన్నప్పటికీ ఆస్కార్ అందుకున్నటువంటి సంతోషం తన మొహంలో ఎంతో స్పష్టంగా కనిపించింది.ఏదేమైనా వరించడం పట్ల సినీ ఇండస్ట్రీలో పండగ వాతావరణాన్నితెచ్చిపెట్టింది.