ఆషాడంలో పెళ్లిళ్లు జరగకపోవడానికి అసలు కారణం ఇదే ?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యం జరగాలంటే తప్పనిసరిగా మంచి ముహూర్తం నక్షత్రం వంటి వాటిని చూసి శుభకార్యాలను నిర్ణయిస్తారు.

ఈ విధంగా మంచి ముహూర్తంలో కార్యాలు నిర్వహించడం వల్ల ఆ కార్యం దిగ్విజయంగా జరిగి శుభ ఫలితాలను ఇస్తుంది.

అందుకోసమే మంచి ముహూర్తాలను చూడటం ఆనవాయితీగా వస్తుంది.ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో ఇలాంటి ముహూర్తాలను నిర్ణయిస్తారు.

రెండు జీవితాలు పెళ్లి బంధంతో ఒక్కటై పది కాలాలపాటు చల్లగా ఉండాలనే ఉద్దేశంతో మంచి ముహూర్తంలో పెళ్లిళ్లు చేస్తారు.ముఖ్యంగా పెళ్లిళ్లు చేయడానికి కొన్ని నెలలు ఎంతో పవిత్రంగా భావిస్తారు.

అందుకోసమే ఆ నెలలో పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా పెట్టుకుంటారు.అదేవిధంగా పెళ్లిళ్లు జరగడానికి కొన్ని నెలలు ఏ మాత్రం మంచిగా ఉండవు.

Advertisement

అలాంటి నెలలో ఒకటే ఈ ఆషాడమాసం.ఆషాడ మాసంలో హిందువులు ఎవరు కూడా పెళ్లిళ్లు చేయడానికి ఇష్టపడరు.

అసలు ఆషాడంలో పెళ్లిళ్లు జరగకపోవడానికి ముఖ్య కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

మన పురాణాల ప్రకారం ఆషాఢ మాసంలో పెళ్లిళ్లు జరగకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు ఆషాడమాసంలో యోగనిద్రలోకి వెళతాడని చెబుతారు.అందుకోసమే ఈ మాసంలో జరిగే శుభకార్యాలకు కూడా విష్ణువు ఆశీర్వాదం ఉండదని భావిస్తారు.

అందుకోసమే ఆషాఢ మాసంలో పెళ్లిళ్లు జరగవని పురోహితులు చెబుతున్నారు.కేవలం పెళ్లిళ్లు మాత్రమే కాకుండా ఏ విధమైనటువంటి శుభకార్యాలను కూడా ఆషాడమాసంలో చేయరు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్24, మంగళవారం 2024

ఇదే కాకుండా ఆషాడమాసం అంటేనే రైతులకు పంటలు వేసుకునే సమయం, ఈ విధంగా వ్యవసాయ పనులలో పూర్తిగా నిమగ్నం కావడం వల్ల ఈ నెలలో పెళ్లిళ్లు చేయడానికి కుదరదు.అలాగే ఆషాడంలో ఎక్కువగా ఈదురు గాలులు ఉంటాయి కనుక గాలుల వల్ల ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయో అనే ఉద్దేశంతో పూర్వకాలంలో పెద్దవారు ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలను చేయకుండా ఉండేవారు.

Advertisement

అందుకోసమే అప్పటినుంచి ఆషాడమాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయకపోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది.

తాజా వార్తలు