ఏపీలో జగన్ పరిపాలన సువర్ణ యుగంగా ఆ పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు.ఇప్పటి వరకు జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు గాని ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేపట్టలేదని, జగన్ సీఎం అవ్వడం ఏపీ ప్రజలు అదృష్టం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
అయితే జాతీయ స్థాయిలో మాత్రం జగన్ పరిపాలన సానుకూల దృక్పథం లేదన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై జాతీయ మీడియా కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ అనేక కథనాలు వెలువరిస్తోంది.
ముఖ్యంగా అమరావతి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై నేషనల్ మీడియా తీవ్రంగా తప్పు పడుతోంది.

అలాగే అమరావతిలో జగన్ సింగపూర్ ప్రాజెక్ట్ రద్దు చేయడంపై ఎకనామిక్ టైమ్స్ ఒక ఎడిటోరియల్ ముద్రించింది .ఆ ఎడిటోరియల్ లో జగన్ పరిపాలన ఆశించిన స్థాయిలో లేదన్నట్టుగా కథనం రాసుకొచ్చింది.ఏపీలో జగన్ తిరోగమన రాజకీయాలు అంటూ కామెంట్ చేసింది.
ఇవన్నీ జాతీయ స్థాయిలో జగన్ పాలనపై విమర్శలు వస్తున్నాయి అనే విషయం స్పష్టం చేస్తున్నాయి.ఇప్పటికే అనేకమంది జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.
పారిశ్రామిక అభివృద్ధికి జగన్ అద్దంపడుతున్నారు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు.ఇప్పటికే ఏపీలో ప్రతిపక్షాలు జగన్ పరిపాలన పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి.

ముఖ్యంగా ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండడుగులు ముందుకే వేస్తున్నారు.ప్రతి దశలోనూ జగన్ ను విమర్శిస్తూ రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.తాజాగా జగన్ జాతీయ మీడియా లో వచ్చిన వార్తా కథనాలను పవన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో ఉన్న పవన్ జగన్ ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు బిజెపి నాయకులతో మంతనాలు చేస్తున్నారు అనే ప్రచారం కూడా ఏపీలో పెరిగింది.అలాగే పవన్ ట్విట్టర్ లో జగన్ పాలనను ఉద్దేశించి మరో విమర్శ కూడా చేశారు.175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో 151అసెంబ్లీ స్థానాలలో వైసీపీని ప్రజలు గెలిపిస్తే వచ్చిన 5 నెలలోనే 35 లక్షల భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని తీసివేసి, 50 మంది కార్మికుల ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత వైసీపీకి దక్కుతుంది అంటూ పవన్ తన ట్విటర్లో విమర్శలు చేశారు.