నాగచైతన్య ని కాదని విజయ్ చేస్తున్న ఆ సినిమా ఇదేనా..?

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్ళ కంటు ఒక ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకోవడం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.

ఇక ఇలాంటి సమయంలోనే వాళ్ళు చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు.

అయితే తెలుగులో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలతో ఓవర్ నైట్ లో స్టార్ హీరో గా మారిపోయిన విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ఇక ఈ క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.

అయితే ఆయన ప్రస్తుతం పరుశురాం డైరెక్షన్ లో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా చేస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా మీదనే భారీ అంచనాలను పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమా దర్శకుడు పరుశురాం ఈ సినిమాని నాగ చైతన్య తో చేయాల్సింది.కానీ కొన్ని వార్య కారణాల వలన నాగచైతన్య తో కాకుండా విజయ్ దేవరకొండ తో ఈ సినిమా చేస్తున్నట్టు గా తెలుస్తుంది.అలాగే ఈ సినిమాని అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేయాల్సింది కానీ పరుశురాం కి అరవింద్ కి కొన్ని గొడవలు రావడం తో పరుశురాం అక్కడి నుంచి దిల్ రాజు( Dil raju ) కాంపౌండ్ లోకి వచ్చి ఈ సినిమా చేస్తున్నాడు.

Advertisement

పరుశురాం( Parasuram ) నాగచైతన్య తో ఈ సినిమా చేసి ఉంటే ఇప్పటికే రిలీజ్ అయిపోయేది కానీ విజయ్ దేవరకొండ ఈ సినిమా చేయడం వల్ల ఈ సినిమా చాలా లేట్ చేస్తున్నాడు.ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన గీత గోవిందం సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి.అయితే ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు