అఖిలప్రియకు బ్యాడ్ లక్ అంటే ఇదే ? 

గత కొంతకాలంగా మాజీ మంత్రి, టిడిపి నేత భూమా అఖిలప్రియ( Bhuma akhilapriya _ వార్తల్లో వ్యక్తిగా ఉంటున్నారు.

అనేక వివాదాల్లో ఆమె పేరు మారుమోగుతుండడంతో పాటు, అనేక కేసులు నమోదవడం, జైలుకు వెళ్లడం వంటివి చోటుచేసుకున్నాయి.

సొంత పార్టీకి చెందిన ఏవీ సుబ్బారెడ్డి( Av subbareddy ), ఆయన అనుచరులపై భౌతిక దాడికి దిగడం వంటివి కలకలం రేపాయి.అది కూడా స్వయంగా నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో చోటు చేసుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు.

ఈ వ్యవహారంలో అఖిల ప్రియ జైలుకు వెళ్లి రెండు రోజుల క్రితమే బెయిల్ పై బయటకు వచ్చారు.అసలు సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో, టికెట్ల కేటాయింపు విషయంలో చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వివాదాలకు దూరంగా ఉంటూ, ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నవారిని అభ్యర్థులుగా ఎంపిక చేయాలని, 2024 ఎన్నికల్లో వైసీపీకి గట్టి పోటీ ఇవ్వాలంటే ఇదే కరెక్ట్ అనే ఆలోచనతో బాబు ఉండగా, అఖిల ప్రియ వ్యవహారం తలనొప్పిగా మారింది.దీంతో ఆమెకు వచ్చే ఎన్నికల్లో టిడిపి టికెట్ ఇస్తుందా లేదా అనేది అనుమానంగానే మారింది.

Advertisement

ప్రస్తుతం యువ గళం పాదయాత్రను లోకష్( Nara lokesh ) నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నిర్వహించారు .ఆ సమయంలో అఖిల ప్రియ జైలులో ఉండడంతో లోకేష్ పాదయాత్రలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయారు.ఈ రెండు నియోజకవర్గాల్లో తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని అఖిలప్రియ ఇప్పటికే ప్రకటించగా, ఈ రెండు నియోజకవర్గాల్లో లోకేష్ నిర్వహించిన పాదయాత్రలో పాల్గొనలేకపోవడం ఆమెకు పెద్ద మైనస్ గాని మారింది.

లోకేష్ పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో తన బల ప్రదర్శన నిరూపించుకోవాలని అఖిల ప్రియ భావించి, తన ప్రత్యర్థైన ఏవీ సుబ్బారెడ్డి, ఆయన అనుచరులపై దాడికి దిగారు.

దాని ఫలితంగానే ఆమె అరెస్టు అయ్యారు.కానీ కీలకమైన ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర నిర్వహించిన సమయంలో భారీ జన సమీకరణ చేపట్టి ,తన బలం ఏమిటో నిరూపించుకునే అవకాశాన్ని అఖిల ప్రియ కోల్పోయారు.ఏవి సుబ్బారెడ్డి పై దాడి వ్యవహారంపై ఇప్పటికే త్రిసభ్య కమిటీని నియమించారు.

ఆ కమిటీ తప్పంతా అఖిల ప్రియదేనని తేల్చడంతో, రాబోయే ఎన్నికల్లో అఖిల ప్రియ కి టికెట్ ఇస్తారా లేదా అనేది సందేహంగా మారింది.ప్రస్తుతం లోకేష్ ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో పాదయాత్ర ముగించుకుని, కడప నియోజకవర్గంలో అడుగుపెట్టారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఇక టిడిపిలో కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, టిడిపి పోలీస్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ కు వియ్యంకుడైన ఏవి సుబ్బారెడ్డి పై దాడి జరగడంతో బోండా ఉమా సైతం అఖిల ప్రియ విషయంలో సీరియస్ గానే ఉన్నారట.దీంతో వచ్చే ఎన్నికల్లో ఆశలు పెట్టుకున్న రెండు నియోజకవర్గాల్లో టికెట్ దక్కడం అనుమానంగానే మారింది.

Advertisement

తాజా వార్తలు