జ‌గ‌న్ మీద ప్ర‌జ‌ల్లో సానుభూతి స‌న్న‌గిల్లుతోందా...?

ఏపీలో జ‌గ‌న్ అంత భారీ మెజార్టీతో గెల‌వ‌డానికి చాలా కార‌ణాలున్నాయి.

మ‌రీ ముఖ్యంగా చెప్పలంటే ఆయ‌న త‌న తండ్రి పేరును వాడుకుని సెంటిమెంట్ తో ఎక్కువ ఓట్లు రాబ‌ట్టార‌నే ప్ర‌చారం ఇప్ప‌టికీ న‌డుస్తూనే ఉంది.

ప్ర‌జ‌ల్లో ఆయ‌న్ను చంద్ర‌బాబు, కాంగ్రెస్ క‌లిసి క‌ష్టాలు పెట్టార‌ని, జైలు పాలు చేశార‌నే సాను భూతి ఉండేది.ఆ సానుభూతి ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా చొచ్చుకు పోయింది.

దాంతో ఆయ‌న్ను ఎవ‌రు ఏమ‌న్నా కూడా యూత్ ముందుగా రియాక్ట్ అయ్యేది.ఆ సానుభూతితోనే ఆయ‌న‌కు తిరుగులేని మెజార్టీ కూడా ద‌క్కింద‌ని చెప్పొచ్చు.

కానీ ఆయ‌న పాల‌న గ‌డుస్తున్నా కొద్దీ కొద్ది కొద్దిగా జ‌నాల్లో సానుభూతి త‌గ్గిపోతోందా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి.వచ్చే ఎన్నికల మాత్రం గ‌త ఎన్నిక‌ల మాదిరిగా సానుభూతి అస్త్రం ఉప‌యోగ‌ప‌డ‌ద‌ని చెబుతున్నారు.

Advertisement

ఎందుకంటే గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న అస‌లు అధికారంలో లేరు కాబ‌ట్టి ఆయ‌న పాల‌న గురించి ఎవ‌రూ మాట్లాడ‌లేదు.కానీ ఇప్పుడు ఆయ‌న అధికారంలో ఉన్నారు కాబ‌ట్టి ఆయ‌న చేస్తున్న ప‌న‌ని ప్రజలు గమనిస్తున్నారు.

కాబ‌ట్టి ఆయ‌న ఈసారి అభివృద్ధి మంత్రం ఉప‌యోగించాలి త‌ప్ప మ‌ళ్లీ సానుభూతి రాగం ఎత్తుకుంటే ఉప‌యోగం ఉండదంటున్నారు.

ఇక ఇప్పుడు జగన్ పాల‌న‌లో చాలామంది అసంతృప్తిగానే ఉంటున్న‌ట్టు తెలుస్తోంది.రీసెంట్ గాఓ ఓ స‌ర్వే నిర్వ‌హించ‌గా ఇందులో ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరు అలాగే రాయల సీమలోని జిల్లాల్లో బ‌లంగా ఉన్న‌టువంటి రెడ్డి సామాజిక వర్గం నేత‌లు మాత్రం ఆయ‌న మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది.చాలా వ‌ర‌కు పథకాలు త‌మ వ‌ర్గానికి ద‌క్క‌ట్లేద‌ని ఇత‌ర వ‌ర్గాల వారికే ద‌క్కుతున్నాయంటూ వాపోతున్నారంట‌.

వీరితో పాటు అటు యూత్ కూడా పెద్ద‌గా ఉద్యోగ‌వ‌కాశాలు రావ‌ట్లేదని, రాష్ట్రం అప్పుడు పెరుగుతున్నాయంటూ వాపోతున్నారు.ఇలా ఎటు చూసినా కూడా జ‌గ‌న్ మీద సానుభూతి త‌గ్గిపోతోంద‌ని అర్థ‌మ‌వుతోంది.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు