నితిన్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్... ?

తెలుగులో ప్రముఖ దర్శకుడు అట్లూరి వెంకీ దర్శకత్వం వహిస్తున్నటువంటి రంగ్ దే అనే చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

అయితే ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా ఈ చిత్రానికి సంబంధించినటువంటి చిత్రీకరణ పనులు ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతున్నాయి.అయితే ఈ చిత్రానికి సంబంధించిన వార్త  సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ మధ్య కాలంలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే అప్పట్లో విక్టరీ వెంకటేష్ సరసన సాహస వీరుడు సాగర కన్య చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించినటువంటి బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.అంతేకాక శిల్పా శెట్టి నితిన్ హీరోగా నటిస్తున్నటువంటి అంధాదున్ చిత్రంలో కూడా మరో కీలక పాత్ర నటించేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శిల్పాశెట్టి పలు బాలీవుడ్ చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.మరోపక్క యోగా గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియా మాధ్యమాలలో వీడియోలను షేర్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది.

Advertisement
చంద్రకాంత్ మరణం పై నటుడు నరేష్ షాకింగ్ కామెంట్స్.. నా పరిస్థితి అదేనంటూ?

తాజా వార్తలు