ఇండియా లో ఇప్పుడు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) పేరు ముందు వరుసలో ఉంటుంది.70 ఏళ్ళ వయస్సులో కూడా ఇప్పటికీ నేటి తరం హీరోలు ముట్టుకోలేని రేంజ్ రికార్డ్స్ పెడుతున్నాడు అంటే ఆయన స్టార్ స్టేటస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.ఆయన సినిమాల్లో ఒక చిన్న పాత్ర దొరికినా అదృష్టమే.ఎంత పెద్ద హీరోయిన్ అయినా, ఎంత పెద్ద హీరో అయినా ఆయన సినిమాలో ఎలాంటి పాత్రలో నటించాల్సిన అవసరం వచ్చినా వెనకడుగు వెయ్యరు.
ఎందుకంటే సౌత్ లో ప్రతీ భాషలోనూ ఆయనకీ ఉన్నంత మార్కెట్ ఏ హీరోకి లేదు.రీసెంట్ గా విడుదలైన జైలర్ చిత్రం( Jailer ) కేవలం సౌత్ ఇండియన్ మార్కెట్ తోనే 650 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది.
ఇక ఓవర్సీస్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.కేవలం ఆ ప్రాంతం నుండే 200 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టింది.
ఇలాంటి స్టార్ హీరో ఎక్కడైనా ఉన్నాడా చెప్పండి.?, అలాంటి సూపర్ స్టార్ పక్కన కాసేపు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనుకోని, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్ నటనకి ఏమాత్రం స్కోప్ లేని పాత్ర వచ్చినా జైలర్ సినిమాలో నటించింది.కానీ ఒక హీరోయిన్ మాత్రం రజినీకాంత్ పక్కన హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చినా కూడా నో చెప్పిందట.ఆ హీరోయిన్ మరెవరో కాదు, కాజల్ అగర్వాల్.
( Kajal Aggarwal ) గడిచిన దశాబ్ద కాలం లో సూపర్ స్టార్ కెరీర్ లో అత్యంత భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమా ‘కబాలి’( Kabali ).ఈ చిత్రం ఓపెనింగ్స్ కి అప్పట్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యింది.అలాంటి సినిమాలో హీరోయిన్ రోల్ కోసం ముందుగా కాజల్ అగర్వాల్ నే అడిగారట.కానీ అప్పట్లో ఆమె రజిని లాంటి సీనియర్ హీరోస్ తో నటించను అని చాలా పొగరుగా సమాధానం చెప్పినట్టు ఇండస్ట్రీ లో ఒక టాక్ వినిపించేది.
ఇక రీసెంట్ గా విడుదలైన ‘జైలర్’ చిత్రం ( Jailer ) లో కూడా తమన్నా( Tamannaah Bhatia ) కంటే ముందుగా కాజల్ ని అడిగారట.కానీ ఆమె ఇందులో కూడా నటించడానికి ఒప్పుకోలేదు.ఈ సినిమా లో తమన్నా పాత్ర కి పెద్దగా గుర్తింపు రాకపోయినా, ‘రా.నువ్వు కావాలయ్యా’ పాటతో ఎంత పాపులర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ పాటనే కనిపిస్తుంది.ఒకవేళ ఈ సినిమా కాజల్ అగర్వాల్ ఒప్పుకొని చేసి ఉంటే సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమెకి పెద్ద బ్రేక్ దక్కేది.
రజినీకాంత్ సినిమాలో ఛాన్స్ రావడమే మహా అదృష్టం అని అనుకుంటున్న ఈరోజుల్లో, రెండు సార్లు ఆయన పక్కన నటించే అవకాశం వచ్చినా వదులుకున్న ఏకైక హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ మిగిలిపోయింది.