జాతీయ జెండాను మెడలో వేసుకుని అసభ్య ప్రవర్తన.. సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తి అరెస్ట్

సింగపూర్‌లో( Singapore ) 36 ఏళ్ల భారత సంతతికి చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఆ దేశ జాతీయ జెండాను మెడలో వేసుకోవడమే కాక.

 Indian-origin Man Arrested In Singapore For Wearing Flag As Cape , Singapore, Ro-TeluguStop.com

కాఫీ షాప్‌లో నిర్వాహకులతో దురుసుగా ప్రవర్తించినందుకు గాను అతనిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం సదరు వ్యక్తిని రెండు వారాల పాటు పోలీసులు జైలులో వుంచారు.

నిందితుడిని రాయ్ రవి జగన్నాథన్‌గా( Roy Ravi Jagannathan ) గుర్తించారు.సెప్టెంబర్ 5న సింగపూర్ జెండాను భుజాలపై వేసుకుని రవి కాఫీ షాప్‌కు వెళ్లినట్లు స్థానిక పోలీస్ అధికారి టింగ్ న్గే కాంగ్ తెలిపారు.

Telugu Indian Origin, Royravi, Singapore, Srimariamman-Telugu NRI

కాఫీ షాప్‌లోని వ్యక్తుల్లో ఒకరు పోలీసులకు ఫోన్ చేసి.నిందితుడు తాగిన మత్తులో దుర్భాషలాడుతున్నాడని, జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని సమాచారం అందించారు.ఆపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ రావడంతో పోలీసులు హుటాహుటిన కాఫీ షాప్ వద్దకు చేరుకున్నారు.పోలీసులను చూసి ఇంకా బిగ్గరగా అరుస్తూ రవి ఇతరులను వేధిస్తూ నానా హంగామా సృష్టించాడు.

ప్రతి టేబుల్ దగ్గరకు వెళ్లి తానే దేవుడినని చెప్పుకుంటూ పిచ్చి పట్టినవాడిలా మాట్లాడాడు.కేకలు, అరుపులు ఆపాల్సిందిగా పోలీసులు ఎంతగా విజ్ఞప్తి చేసినా బేఖాతరు చేయడంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే రవి ఈ తరహా ప్రవర్తనతో హల్‌చల్ చేయడం ఇదే తొలిసారి కాదు.ఈ ఏడాది జూలైలో మరో కాఫీ షాప్ వద్ద బిగ్గరగా అరుస్తూ, అసభ్యకరంగా సైగలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.

ఆపై ఐదు రోజులు పాటు జైల్లో గడిపి విడుదలయ్యాడు.

Telugu Indian Origin, Royravi, Singapore, Srimariamman-Telugu NRI

కాగా.పవిత్రమైన దేవాలయం ఆవరణలో మహిళను చెంపపై కొట్టి, అసభ్యంగా ప్రవర్తించిన భారత సంతతి లాయర్‌పై గత వారం సింగపూర్ పోలీసులు( Singapore Police ) అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.గత శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో శ్రీ మరియమ్మన్ ఆలయం( Sri Mariamman Temple ) వద్ద మహిళ చెంపపై నిందితుడు రవి మాడసామి కొట్టాడు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని గత శనివారం నాలుగు అభియోగాలు నమోదు చేశారు.రవి మాడసామి గతంలోనే లాయర్ ప్రాక్టీస్ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యాడు.

అసభ్య పదజాలంతో దూషించడం, వేధింపులు వంటి ఇతర కౌంట్లపై కూడా అభియోగాలు నమోదు చేశారు.గడిలో వున్న మరో మహిళను వేశ్య అని పిలిచి ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు.

అంతకుముందు పగోడా స్ట్రీట్‌లోని ఓ వ్యక్తిని తమిళంలో అసభ్యపదజాలంతో దూషించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube