శాకుంతలం కోసమైనా సమంత వస్తుందా..?

ఈమధ్యనే యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఫిబ్రవరి 17న శాకుంతలం సినిమాతో వస్తుంది.

ఈ సినిమా విషయంలో గుణశేఖర్ అండ్ టీం ప్రమోషన్స్ ని భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసిన శాకుంతలం ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో ఉండనున్నాయట.అయితే అంతా బాగానే ఉంది కానీ అసలు సమంత ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

యశోదకి కేవలం ఒక ఇంటర్వ్యూ ఇచ్చి మమా అనిపించిన సమంత శాకుంతలం కోసమైనా వస్తుందా రాదా అన్నది చూడాలి.అసలు ఇంతకీ సమంత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది.

ఆమె ట్రీట్ మెంట్ ఎలా నడుస్తుంది లాంటి విషయాల మీద కూడా ఎలాంటి అప్డేట్ లేదు.సమంత శాకుంతలం సినిమా ప్రమోషన్స్ కి వస్తేనే ఆ సినిమాకు న్యాయం జరుగుతుంది.

Advertisement

లేదంటే మాత్రం అంత బజ్ ఏర్పడే ఛాన్స్ లేదు.కానీ సమంత హెల్త్ విషయమై కన్ఫర్మేషన్ తీసుకున్నాకనే రిలీజ్ డేట్ ప్రకటించి ఉంటారని కొందరు అంటున్నారు.

ఏది ఏమైనా సమంత శాకుంతలం పై మాత్రం అంచనాలు భారీగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు