'పుష్ప 2' ఛాన్స్ కు నో చెప్పిన సామ్.. ఆ భయంతోనే అలా చేసిందా?

స్టార్ హీరోయిన్ లలో సమంత రూత్ ప్రభు ఒకరు.ఈమె స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

అయితే మధ్యలో పెళ్లి, విడాకులు అంటూ కెరీర్ డిస్టర్బ్ అయ్యింది.కానీ సామ్ విడాకుల తర్వాత మళ్ళీ తన సినీ కెరీర్ ఇంతకు ముందులా కొనసాగిస్తుంది.

ఈ క్రమంలోనే ఈమె విడాకుల తర్వాత ముందుగా నటించిన సినిమా పుష్ప.ఈ సినిమాను సుకుమార్ తెరకెక్కించగా అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించారు.

అయితే ఈ సినిమాలో సామ్ ఐటెం సాంగ్ చేసింది.పుష్ప ఐటెం సాంగ్ తో పాన్ ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయ్యింది.

Advertisement

ఈ పాట తర్వాత సమంతకు మరిన్ని అవకాశాలు వరించాయి.పాన్ ఇండియా వ్యాప్తంగా ఆకట్టు కోవడంతో సామ్ కు బాలీవుడ్ లో సైతం వరుస ఆఫర్స్ వరించాయి.

అయితే వరుస అవకాశాలు అందుకుంటూ వాటిని పూర్తి చేస్తున్న సమయంలోనే ఈమె హెల్త్ ప్రాబ్లెమ్ బారిన పడింది.ఇప్పుడిప్పుడే దీని నుండి కోలుకుంటున్న సామ్ షూట్ లో పాల్గొనడానికి సిద్ధం అవుతుంది.మరి ఆరోగ్యం మెరుగు పడడంతో ఈమె కమిట్ అయిన ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉంది.

బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ తో పాటు విజయ్ దేవరకొండ ఖుషి సినిమా కూడా ఈమె పూర్తి చేయాల్సి ఉంది.

ఇదిలా ఉండగా సామ్ కు సుకుమార్ మరోసారి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.అది కూడా పుష్ప 2 లో అట.ఈసారి కూడా సమంత సామ్ కోసం ప్రత్యేక గీతాన్ని ప్లాన్ చేయాలని అనుకుని ఈమెను సంప్రదించగా సామ్ అంతగా ఆసక్తి చూపించలేదని ఈ ఆఫర్ ను రిజక్ట్ చేసింది అని టాక్.అయితే సామ్ రిజక్ట్ చేయడానికి కారణం.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

మరో ఐటెం సాంగ్ కూడా చేస్తే ఈమె సినిమాలను మర్చిపోయి కేవలం ఐటెం సాంగ్స్ ను మాత్రమే గుర్తు పెట్టుకుంటారనే భయంతోనే సామ్ ఈ ఆఫర్ ను వద్దు అనుకుంది అని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు