పవన్ కళ్యాణ్ సినిమాలో లేడీ వకీలుగా రేణు దేశాయ్...

దాదాపు మూడేళ్ల తర్వాత రాజకీయాల్లో నుంచి మళ్లీ టాలీవుడ్ లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న టువంటి వకీల్ సాబ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు మరియు పలువురు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి ఓ వార్త నెట్లో హల్ చల్ చేస్తోంది.

ఈ చిత్రంలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తుందని పలు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాక ఇప్పటికే దర్శకుడు శ్రీరామ్ వేణు కూడా ఈ చిత్ర కథాంశాన్ని రేణు దేశాయ్ తో చెప్పాడట.

అయితే కథ విన్నటువంటి రేణు దేశాయ్ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్ర అయినందువలన వెంటనే ఓకే చెప్పిందట.అయితే అధికారికంగా ఈ విషయంపై ప్రకటనలు రాలేదు కానీ సైలెంట్ గా చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం.

Advertisement

అయితే ఏదేమైనప్పటికీ పెళ్లయిన తర్వాత సినీ పరిశ్రమకు దూరం అయినటువంటి రేణు దేశాయ్ మళ్లీ పవన్ చిత్రంతోనే సినీ పరిశ్రమలోకి రీ-ఎంట్రీ ఇస్తుండటంతో ఈ విషయం పై పలువురు గుసగుసలాడుకుంటున్నారు.

అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నటువంటి మరో చిత్రానికి కూడా పవన్ కళ్యాణ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.ఈ చిత్రం కూడా దాదాపుగా సైలెంట్ గానే చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం.అయితే ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు