మాస్ మహారాజా రవితేజ ( Ravi Teja )నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”టైగర్ నాగేశ్వరరావు’‘.( Tiger Nageswara Rao ) నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవితేజ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారడానికి సిద్ధం అవుతున్నాడు.ఈ సినిమాపై ముందు నుండి అంచనాలు ఉన్నాయి.ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ గ్లింప్స్ తో అంచనాలు డబుల్ అయ్యాయి.

ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పీక్స్ కు చేర్చారు.ప్రజెంట్ ఈ సినిమా ఒక వైపు మిగిలిన కొద్దీ భాగం షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటూనే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు.మరో పక్క ఒక్కో అప్డేట్ ఇస్తూ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు.ఇలా అన్ని పనులను చక్కబెడుతూ వెళ్తున్న ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అనుకున్న దాని కంటే ముందే వస్తుంది అనే టాక్ సోషల్ మీడియాలో( Social media ) వైరల్ అయ్యింది.అంటే ప్రీపోన్ అవ్వబోతుంది అనే టాక్ మొదలయ్యింది.
అయితే ఈ సినిమా ముందే వస్తుంది అనే విషయంలో ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ ఏ మాత్రం కనిపించడం లేదు.అందుకు కారణం కూడా ఉంది.

మాస్ రాజా ఫ్యాన్స్ ఈ సినిమా ముందే రిలీజ్ కాబోతుంది అని తెలియడంతో వద్దు అంటున్నారు.అందుకు కారణం రవితేజ చేస్తున్న మొదటి పాన్ ఇండియన్ మూవీ కావడంతో క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడవద్దు అంటున్నారు.సోలో రిలీజ్ కోసం చూసుకుని అవుట్ ఫుట్ బాగా రాకుండానే రిలీజ్ చేస్తే ప్లాప్ అయ్యే ప్రమాదం ఉంది అంటున్నారు.అక్టోబర్ 6నే రిలీజ్ అవ్వనుంది అనే టాక్ పై మేకర్స్ స్పందిస్తారో లేదో చూడాలి.







