గురుకుల పాఠశాల ఉపాద్యాయులు క్రమబద్దీకరణ.. ఉత్తర్వులు జారీ

ఉపాధ్యాయ దినోత్సవ కానుకగా గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు( Kalvakuntla Chandrasekhar Rao ) నిర్ణయం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( Minister Puvvada Ajay Kumar ) హర్షం వ్యక్తం చేశారు.సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా పని చేస్తున్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్దీకరిస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 Regularization Of Gurukula School Teachers Orders Issued , Gurukula School Teach-TeluguStop.com

సాంఘీక సంక్షేమ శాఖ గురుకులాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల జీతం, బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులను ప్రభుత్వం ప్రకటించడం చరిత్రాత్మకం నిర్ణయమని పేర్కొన్నారు.పేదలకు ప్రభుత్వ విద్యను చేరువ చేయడంలో భాగంగా మన ఇప్పటికే అద్భుతంగా అమలు చేసిన మన ఊరు మన బడి , మన బస్తీ మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్యకు విశేష ఆదరణతో పాటు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల విపరీతంగా పెరిగిందన్నారు.

సాంఘీక సంక్షేమ శాఖ గురుకులాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను క్రమబద్దీకరణతో ఉద్యోగులకు భద్రత లభించిందని పేర్కొన్నారు.ఉపాధ్యాయు దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఅర్ గారి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉపాద్యాయులందరికీ మారో సారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube