రాహుల్ ని గ్రహణం వీడినట్టేనా ?

సాధారణ రాజకీయ విమర్శల్లో భాగంగా మోడీ( PM Narendra Modi ) ఇంటి పేరు మీద ప్రతిపక్ష కాంగ్రెస్ నేత మరియు ఎంపీ రాహుల్ గాంధీ( Rahul Gandhi ) పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడం తో గాంధీల వారసుడికి భారీ రిలీఫ్ దక్కినట్లు అయింది.

కాంగ్రెస్ తో విడదీయలేని అనుబందం ఉన్న గాంధీ కుటుంబాన్ని రాజకీయాలలో లేకుండా చేద్దామనే రాజకీయ దురుద్దేశాలతోనే కోర్టు తీర్పు రాగానే ఆగమేఘాల మీద ఆయన్ని ఎంపీ గా అనర్హుడిగా ప్రకటించేసి ఆయన ఎంపీ స్థానాన్ని ఎలక్షన్ కు నోటిఫై చేసి ఆయన అధికార నివాసాన్ని కూడా ఖాళీ చేయించడం లో పార్లమెంటరీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు మరియు కొన్ని తెరవెనుక శక్తులు చూపించిన అత్యుత్సాహంపై సుప్రీంకోర్టు తీర్పు నీళ్లు చల్లనట్లయ్యింది .

సాధారణ రాజకీయ విమర్శలను గరిష్ట శిక్ష వేయడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు ఆ శిక్ష వేయడానికి సరైన కారణాలను కూడా వివరించలేదంటూ ఆక్షేపించింది .

ఇది ఒక వ్యక్తికి వేసిన శిక్ష మాత్రమే కాదని ఒక ప్రజాప్రతినిధికి సరైన కారణం లేకుండా ఇంత మెజారిటీ శిక్ష చేయడం ద్వారా ఆయనను ఎన్నుకున్న ప్రజల హక్కులను కూడా ఇది శిక్షిస్తుంది అంటూ సుప్రీంకోర్టు ( Supreme Court ) వ్యాఖ్యానించడం గమనార్హం .దాంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్న వాదనకు నైతిక మద్దతు దొరికినట్టు అయింది.తన జోడోయాత్ర( Jodo Yatra ) ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న తమ నేతను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలా కోర్టుల ద్వారా ఎదుర్కోవాలని చూస్తున్న బాజాపా దొరణికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది అంటూ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ తీర్పుతో రాహుల్ పై అనర్హత ను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితుకి క్రమశిక్షణ కమిటీ నెట్టబడినట్టుగా తెలుస్తుంది.తీర్పురాగానే కాంగ్రెస్ సభ్యులు లోక్సభ స్పీకర్ను కలిసి ఆయన ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించాల్సిందిగా కోరి నట్లుగా తెలుస్తుంది.

Advertisement

తీర్పు నిలుపి వేయడంతో ఈ లోకసభ సమావేశాలలోనే రాహుల్ పార్లమెంట్లో ప్రవేశించడానికి మార్గం సుగమం అయ్యింది.ఇండియా కూటమికి( INDIA Alliance ) ఇది తొలి విజయం గా భావించవచ్చు .నిజానికి రాహుల్ గాంధీ లాంటి వివిఐపి ల కేసుల విషయంలో డైరెక్ట్ గానే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ కింది న్యాయస్థానాల నుంచి తన వాదన వినిపిస్తూ వచ్చిన రాహుల్ గాంధీకి ఈ విజయం వ్యక్తిగత విజయం గానే చూడాలంటూ కూడా రాజకీయ పరిశీలకులు అంచనా వ్యాఖ్యానిస్తున్నారు మరి కోర్ట్ తీర్పుపై అధికార బాజాపా ప్రతిస్పందన ఏమిటో చూడాలి.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు