కాచుకో మోడీ.. రాహుల్ ఎంట్రీ ?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi )గతంతో పోల్చితే ప్రస్తుతం ఎంతో రాజకీయ పరిణితి చెందడానే చెప్పవచ్చు.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని గట్టిగా ప్రయత్నిస్తున్న రాహుల్ గాంధీకి ఆ మద్య బీజేపీ బ్రేకులు వేసే ప్రయత్నం చేసింది.

అప్పుడెప్పుడో గత ఎన్నికల ముందు ప్రధాని మోడీ( Narendra Modi ) ఇంటిపేరును ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అనుచితమని.ఆయనపై గుజరాత్ సూరత్ కోర్టులో పరువు నష్టందావా కేసు వేశారు కమలనాథులు.

అయితే రాజకీయ నాయకులు వ్యతిగత విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమే అయినప్పటికి రాహుల్ గాంధీకి చెక్ పెట్టేందుకు ఏకంగా కోర్టును ఆశ్రయించారు బీజేపీ నేతలు.కోర్టు కూడా ఊహించని రీతిలో తీర్పు ఇస్తూ రాహుల్ గాంధీ పై రెండేళ్ళు అనర్హత వేటు వేసింది.ఫలితంగా రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వానికి తాత్కాలికంగా అడ్డంకి ఏర్పడింది.

అయితే తాజాగా రాహుల్ గాంధీ పై ఉన్న కేసు విషయంలో తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు బీజేపీని షాక్ గురయ్యేలా చేసింది.రాహుల్ గాంధీ పై ఉన్న అనర్హత వేటుపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

Advertisement

ఫలితంగా రాహుల్ గాంధీ మళ్ళీ పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు.దీంతో కాంగ్రెస్ నేతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఇక పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు.మోడీపై ఎలాంటి ప్రశ్నలు సంధించనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.ఈ మద్య మణిపూర్ అల్లర్ల విషయంలో మోడీ సర్కార్ ను ఇరుకున పెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి( Congress party ) లోక్ సభలో రాహుల్ గాంధీ గళం తోడైతే మోడీ సర్కార్ ఇరుకున పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక మరో 10 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండగా.విపక్షాల తరుపున పి‌ఎం అభ్యర్థిగా రాహుల్ గాంధీ దాదాపు ఖాయమే.ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పై ఉండే అనర్హత వేటు తొలగిపోవడం.

విపక్షలకు కలిసొచ్చే అంశం.మరి రాహుల్ ఇకపై రాహుల్ గాంధీ దూకుడు ఎలా ఉండబోతుందో చూడాలి.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు