దేశంలో మోడి( Narendra Modi ) మేనియా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.2014 నుంచి ఇప్పటివరకు అదే చెక్కు చెదరని ప్రజాధరణతో దూసుకుపోతున్నారు ప్రధాని మోడి.కేవలం మోడీని చేసే దేశ ప్రజలు బీజేపీని నమ్ముతున్నారనడంలో ఎలాంటి సందేహంలేదు.గడిచిన ఈ 9 ఏళ్లలో దేశాన్ని ఎన్నో రంగాలలో ముందుకు నడిపించిన మోడీ ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు.
అయితే 2019 ఎన్నికల తరువాత మోడీకి గతంలో ఉన్న ప్రజాధరణ మెల్లగా తగ్గుతూ వస్తోంది.

నిత్యవసర ధరల పెరుగుదల, మోడీ సర్కార్ నియంత పాలన, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, ఇలాంటివన్నీ మోడీపై వ్యతిరేక ప్రభావం చూపిస్తున్నాయనేది కొందరి అభిప్రాయం.దీంతో గట్టిగా ప్రయత్నిస్తే వచ్చే ఎన్నికల్లో మోడీ గద్దె దించవచ్చనే ఆలోచనలో దేశ విపక్ష పార్టీలు ఉన్నాయి.దాంతో మోడీని గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యేందుకు సిద్దమతున్న సంగతి తెలిసిందే.
సౌత్ నార్త్ అనే భేదం లేకుండా అందరిదీ ఒకే లక్ష్యం కావడం గమనించాల్సిన విషయం.సౌత్ లో తమిళ్ నాడు సిఎం స్టాలిన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్( CM KCR ) బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, డిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ), బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్( Nitish Kumar ).ఇలా ఒక్కరెంటి మహామహులంతా మోడీ టార్గెట్ గానే కథం తొక్కుతున్నారు.

ఇక కాంగ్రెస్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.మోడీని గద్దె దించే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలదనే విషయం తెలిసిందే.మరి ఇలా విపక్షాలన్నీ ఏకమౌతున్న నేపథ్యంలో వీరిని ఎదుర్కోవడానికి మోడీ వద్ద ఉన్న వ్యూహం ఏంటి ? ఇంతమందిని ఢీ కొట్టి మోడీ నిలవడం సాధ్యమేనా ? ఇలాంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.అయితే ఎంతమంది కలిసి వచ్చిన వచ్చే ఎన్నికల్లో కూడా మోడీనే అధికారం చేపడతారని బీజేపీ కాన్ఫిడెంట్ గా ఉంది.ఇక విపక్షాలు ఏకం కావడంపై తాజాగా నరేంద్ర మోడీ కూడా తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చారు.

దేశంలోని వ్యవస్థలను పారదర్శికంగా చేస్తున్నందుకు అవినీతిపరులంతా ఏకం అవుతున్నారని, ఎంతమంది ఏకం అయిన వెనక్కి తగ్గే సమస్యే లేదని మోడీ తేల్చి చెబుతున్నారు.ప్రజల అండ తనకు ఎల్లప్పుడు ఉంటుందని ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.దీంతో ఇటువైపు మోడీ ఒక్కడు.అటు వైపు మొత్తం విపక్షాలు అయినప్పటికి మోడీ తగ్గేదెలే అంటుండడంతో బీజేపీ దళంలో ఉత్సాహం మరింత రెట్టింపు అవుతోంది.