హైదరాబాద్ సికింద్రాబాద్ లో సుమారు 150 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.చింతబావి బస్తీకి చెందిన ప్రజలు కలుషిత నీరు తాగడంతో అస్వస్థతకు గురి అయ్యారని తెలుస్తోంది.
వాంతులు, విరోచనాలు కావడంతో బాధితులు సమీప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే గత మూడు రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతుందని స్థానికులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న అధికారులు నీటి పైప్ లైన్లను తనిఖీ చేస్తున్నారు.







