Nagababu : నిహారిక లాగే తన కొడుకు జీవితం కాకూడదని నాగబాబు ఆ పని చేస్తున్నారా..?

మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి ( Chiranjeevi ) తర్వాత ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్,నాగబాబులలో కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే స్టార్ హీరోగా ఎదగ గలిగారు.

ఇక నాగబాబు ( Nagababu ) హీరోగా ఎదగలేక సపోర్టింగ్ రోల్స్ చేస్తూ స్థిరపడ్డారు.

అలాగే నిర్మాతగా కూడా మారి కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేశారు.ఇదిలా ఉంటే త్వరలోనే నాగబాబు ఇంట్లో పెళ్లి బజాలు మోగబోతున్నాయి.

టాలీవుడ్ మీడియా నుండి వస్తున్న సమాచారం ప్రకారం.నవంబర్ 1న వరుణ్ తేజ్ లావణ్యలు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారట.

ఇక వీరిద్దరూ ఇటలీ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారని ఇప్పటికే ఎన్నో వార్తలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే.ఇక అందరూ అనుకున్నట్లుగానే ఇటలీలోనే పెళ్లి ఉంటుంది అని క్లారిటీ వచ్చింది.

Advertisement

ఇక ఇప్పటికే పెళ్లి కోసం దాదాపు వన్ వీక్ వరకు మెగా ఫ్యామిలీ లోని చాలామంది తమ షూటింగ్స్ కి పుల్ స్టాప్ పెట్టారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే పెళ్లి విషయంలో ఎంతో హ్యాపీగా ఉండాల్సిన నాగబాబు భయం భయంతో ఉంటున్నారట.దానికి ప్రధాన కారణం నిహారిక ( Niharika ) లాగే తన కొడుకు జీవితం కూడా కాకూడదని ఒక సంచలనం నిర్ణయం తీసుకున్నారట.

అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.నిహారిక జొన్నలగడ్డ చైతన్యలు ఉదయపూర్ లోని విల్లా లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.అయితే వీరి పెళ్లి సమయంలో ఫోటోషూట్స్ ఎక్కువగా తీయించుకోవడం వల్ల ముహూర్తానికి కాస్త లేట్ అవ్వడంతో తాళి కరెక్ట్ టైం లో కట్టలేదట.

ఇక ఇదే కారణం వల నిహారిక జొన్నలగడ్డ చైతన్య ( Niharika -Jonnalagadda Chaithanya ) ల పెళ్లి జీవితంలో మనస్పర్ధలు వచ్చి విడిపోయారని అప్పట్లో ఒక టాక్ వినిపించింది.అయితే తన కొడుకు జీవితం కూడా ఇలా జరగకూడదు అని నాగబాబు అన్ని ముందే ప్లాన్ ప్రకారం చేశారట.

ఇందులో భాగంగానే ప్రీ వెడ్డింగ్ షూట్ ని కూడా పెళ్లికి ముందు ఎప్పుడో ముగించుకున్నారు.అలాగే పెళ్లి సమయంలో కూడా వరుణ్ తేజ్ లావణ్య ( Varun tej-Lavanya ) ఏదైనా ఫోటోలు దిగాలి అనుకుంటే అనుకున్న ముహూర్తానికి తాళి కట్టాకే వాళ్లు ఫోటోలు దిగాలి అని ఒక కండిషన్ పెట్టాడట.

పొరుగింటి వ్యక్తిని చెప్పుతో కొట్టిన లేడి పోలీస్... వీడియో వైరల్...
నా కూతురును దారుణంగా ట్రోల్ చేశారు.. ట్రోలర్స్ పై మండిపడిన రాజీవ్ కనకాల?

ఏది ఏమైనా కూడా అనుకున్న ముహూర్తానికి వీళ్ళిద్దరి పెళ్లి జరిగిపోవాలి అని నాగబాబు గట్టి నిర్ణయం తీసుకున్నారట.అయితే ఈ విషయం తెలిసి కొంతమంది నెటిజన్లు మాత్రం నవ్వుకుంటున్నారు.ఎందుకంటే మీరైతే అలా ఆలోచిస్తున్నారు మరి మామూలు జనాలు పెళ్లళ్ల విషయంలో 10:00 కి అనుకుంటే 2:00 కి పెళ్లి జరుగుతుంది.అలా అని పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కరెక్ట్ టైం కి పెళ్లి చేసుకోలేదని విడిపోతున్నారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు