బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి( Komatireddy Raj Gopal Reddy ) వ్యవహారం మునుగోడు ఉపఎన్నికల టైమ్ లో ఎంతటి హాట్ టాపిక్ అయిందో అందరి తెలిసిందే.అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగిన రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ గూటికి చేరారు.
బీజేపీలో చేరడంతో పాటు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.దీంతో మునుగోడు ఉపఎన్నికలకు తెరలేచింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన ప్రజాదరణ కలిగి ఉన్న నేతగా కోమటిరెడ్డి బ్రదర్స్ కు మంచి పేరు ఉంది.అయితే కాంగ్రెస్ పార్టీలో విబేదాల కారణంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరగా, ఆయన బ్రదర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komatireddy Venkat Reddy )మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.

అయితే రాజగోపాల్ రెడ్డికి బీజేపీ నుంచి 1800 కోట్ల ముడుపులు ముట్టాయని, కేవలం డబ్బు , కాంట్రాక్ ల కోసమే ఆయన బీజేపీలో చేరరాని, కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.దీంతో ఆయన నియోజికవర్గం మునోగుడులో నెగిటివ్ ఇంపాక్ట్ గట్టిగానే పడింది.ఫలితంగా మునుగోడు ఉపఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూశారు రాజగోపాల్ రెడ్డి.ఇదిలా ఉంచితే ఇటీవల కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఘోర ఓటమి చవిచూడగా కాంగ్రెస్ ఘనవిజయన్ని నమోదు చేసింది.
ఆ ప్రభావం తెలంగాణపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయనేది కొందరి వాదన.

ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి మళ్ళీ కాంగ్రెస్ లో చేరతారని, బీజేపీకి ఆయన గుడ్ బై చెబుతున్నాట్లు. సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయింది.దీంతో ఈ వార్తలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి.
తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు.కాంగ్రెస్ లో కొందరి విధానాలు నచ్చకపోవడం వల్లే బీజేపీలో చేరానని.
ఇక పార్టీ మారడం అంటూ జరగదని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.అంతే కాకుండా మళ్ళీ మునుగోడు నుంచే బీజేపీ అభ్యర్థిగా తాను వచ్చే ఎన్నికల్లో బరిలో దిగబోతున్నట్లు కూడా చెప్పుకొచ్చారు.
అయితే ఈసారైనా మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తారా ? అంటే డౌటే అనే సమాధానాలు కనిపిస్తున్నాయి.ఎందుకంటే బిఆర్‌ఎస్ తరుపున బలమైన నేత బరిలో ఉండడం, అటు కాంగ్రెస్ కూడా పుంజుకోవడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో కూడా మునుగోడు( Munugodu ) గెలుపు కష్టమే అనే వాదన నడుస్తోంది.
మరి ఏం జరుగుతుందో చూడాలి.