ఆదాశర్మ ( Adah Sharma ) తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని పేరు.ఇండస్ట్రీలోకి హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈమె తెలుగులో పలు సినిమాలలో నటించారు.
ఇలా ఇండస్ట్రీలో 2008 వ సంవత్సరంలో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె ఇప్పటివరకు పలు సినిమాలలో నటించారు.అయితే ఈమెకు ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోయిందనీ చెప్పాలి.
ఇక తాజాగా ఈమె ది కేరళ స్టోరీ ( The Kerala Story ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఆమధ్య ది కశ్మీర్ ఫైల్స్( The Kashmir Files ) హిట్ అయింది, ఇప్పుడు ది కేరళ స్టోరీ బ్లాక్ బస్టర్ అయింది.ఇలా అప్పుడప్పుడు కొన్ని సినిమాలు ఊహించని విధంగా ప్రేక్షకుల ముందుకు వస్తూ సూపర్ హిట్ విజయాన్ని అందుకుంటూ ఉంటాయి.దాదాపు 15 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి నటి ఆదాశర్మకు ఇప్పటివరకు సరైన హిట్ మాత్రం పడలేదు కానీ 15 సంవత్సరాల తర్వాత ఈమెకు ది కేరళ స్టోరీ సినిమా భారీ విజయాన్ని అందించింది.ఇప్పటివరకు ఈమె పలు తెలుగు సినిమాలలో ఇతర భాష చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు.

ఈ క్రమంలోనే ఆదాశర్మ ది కేరళ స్టోరీ విన్న వెంటనే ఈమెకు బాగా నచ్చడంతో వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.నటించడానికి మంచి స్కోప్ ఉంటుందని భావించింది.అందుకే ఓకే చేసింది. అయితే అప్పుడు ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం తనని బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటిగా తనకు ఎంతో మంచి సక్సెస్ అందించిందని చెప్పాలి.
ఇక ఈ సినిమా ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.అయితే ఈ ఒక్క సినిమా సక్సెస్ కావడంతో ఆదాశర్మ కెరియర్ మారిపోతుందని భావించడానికి వీలు లేదు.
ఈమె తదుపరి రెండు మూడు సినిమాలు ఇలాగే మంచి సక్సెస్ అందుకుంటేనే తనుకు సినీ కెరియర్ ఉంటుందని పలువురు భావిస్తున్నారు.







