మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు అనే విషయం మన అందరికీ తెలిసిందే.వీళ్లిద్దరు #RRR చిత్రం నుండే కాదు, అంతకు ముందు నుండే మంచి స్నేహితులు.
దశాబ్దాల నుండి నందమూరి మరియు మెగా ఫ్యామిలీ మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద ఒక రేంజ్ లో పోటీ ఉన్నప్పటికీ, అభిమానులు తరచూ సోషల్ మీడియా లో మరియు బయట గొడవ పడుతున్నప్పటికీ ఈ ఇరువురి హీరో సొంత సోదరులు లాగా కలిసి మెలిసి ఉండడం మనం #RRR మూవీ ప్రొమోషన్స్ అప్పుడు గమనించొచ్చు.కానీ అదంతా కేవలం సినిమా ప్రమోషన్ కోసం మాత్రమే అని ఇప్పుడు అర్థం అవుతుంది.
ఎందుకంటే వీళ్ళిద్దరూ అప్పట్లో ఉన్నంత అన్యోయంగా ఇప్పుడు లేరని అభిమానులకు అనిపిస్తుంది.దానికి తోడు జూనియర్ ఎన్టీఆర్ కి( Junior NTR ) రీసెంట్ గా సైమా అవార్డు వచ్చినప్పుడు కూడా మూవీ టీం మొత్తానికి కృతఙ్ఞతలు తెలియచేసాడు కానీ , రామ్ చరణ్( Ram Charan ) పేరు మాత్రం తియ్యలేదు.

ఇక ఎన్టీఆర్ వ్యక్తిగత పీఆర్ టీం చేస్తున్న పనులు చూస్తూ ఉంటే ఎన్టీఆర్ కి రామ్ చరణ్ అంటే చాలా అసూయ ఉంది అంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ అభిమానులు ఆరోపిస్తున్నారు.ఎందుకంటే నిన్న రామ్ చరణ్ ప్రముఖ ఇండియన్ క్రికెటర్ మహేందర్ సింగ్ ధోని తో ( Mahendra Singh Dhoni ) కలిసి ఒక ఫోటో దిగాడు.వీళ్లిద్దరు కలిసి ఒక కమర్షియల్ యాడ్ లో నటించబోతున్నారట.సోషల్ మీడియా మొత్తం నిన్న ఈ ఫొటోలే చక్కర్లు కొట్టాయి.దీని ద్రుష్టి ఎలా అయిన పక్కకి మరలించాలనే ఉద్దేశ్యం తో ఎన్టీఆర్ పీఆర్ టీం అప్పటికప్పుడు ‘దేవర’ చిత్రాన్ని( Devara Movie ) రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నామని ఒక వీడియో ప్రకటన విడుదల చేయించారు.దీని పై రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియా లో ఎన్టీఆర్ పీఆర్ టీం పై విరుచుకుపడ్డారు.
అలాగే నిన్న సాయంత్రం రామ్ చరణ్ ముంబై లో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ( Rajkumar Hirani ) ని కలిసాడు.

అక్కడ ఆయన దాదాపుగా రెండు గంటల పాటు రాజ్ కుమార్ హిరానీ తో చర్చలు జరిపాడు.ఎందుకంటే వీళ్లిద్దరు కలిసి త్వరలోనే ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ చెయ్యబోతున్నారు.పీకే, 3 ఇడియట్స్, సంజూ లాంటి సంచలనాత్మక చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఆయన.ఇక్కడ రాజమౌళి ఎలాగో, అక్కడ రాజ్ కుమార్ హిరానీ అలా అన్నమాట.అందుకే ఈ కాంబినేషన్ పై అంతటి క్రేజ్ ఏర్పడింది.
ఈ వార్త బయటకి వచ్చినప్పుడు సోషల్ మీడియా మొత్తం మోతెక్కిపోయింది.ఈ వార్త నుండి ద్రుష్టి మరలించాలని ఎన్టీఆర్ పీఆర్ టీం వెంటనే ప్రశాంత్ నీల్ తో( Prasanth Neel ) సినిమా ఏప్రిల్ నుండి ప్రారంభం అవుతుందని అధికారిక ప్రకటన చేయించారు.
సందర్భం లేకుండా ఇప్పుడు ఈ ప్రకటన ఎందుకు వచ్చింది అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కూడా అర్థం కాలేదు.ఇదంతా ఎన్టీఆర్ కి తెలియకుండానే పీఆర్ టీం చేస్తుందా, లేదా ఎన్టీఆర్ చెప్పబట్టే అలా చేస్తున్నారా అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేశారు.